Home / Entertainment / బెల్లంకొండ శ్రీనివాస్ మూడవ హీరోయిన్ గా ‘తమన్నా’

బెల్లంకొండ శ్రీనివాస్ మూడవ హీరోయిన్ గా ‘తమన్నా’

Author:

bellamkonda-sai-srinivas-and-tamanna

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు శీను’ చిత్రంతో వెండితెరకి పరిచయమైన సంగతి తెలిసిందే. తాజాగా భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ‘స్పీడున్నోడు’ చిత్రంలో నటిస్తున్నాడు. తన మొదటి చిత్రం ‘అల్లుడు శీను’ చిత్రంలో ఐటెంసాంగ్ లో మెరిసిన తమన్నా ప్రస్తుతం తన రెండవ చిత్రం ‘స్పీడున్నోడు’లో కూడా మరో ఐటెంసాంగ్ చేస్తుంది. ఇక బోయపాటి దర్శకత్వంలో తెరకేక్కబోతున్న తన మూడవ చిత్రంలో తమన్నాని ఏకంగా హీరోయిన్ గా ఖరారు చేసాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ విషయాన్నీ బెల్లంకొండ శ్రీనివాస్ మంగళవారం అధికారికంగా ప్రకటించాడు.

‘అల్లుడు శీను’,‘స్పీడున్నోడు’ చిత్రలలో ఐటెంసాంగ్స్ చేయడానికి తమన్నా ఒక్కోక్క ఐటెంసాంగ్ కి కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒక ఐటెంసాంగ్ కే కోటికి పైగా తీసుకున్న తమన్నా మరీ హీరోయిన్ గా నటించడానికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్ మొదటి చిత్రం ‘అల్లుడు శీను’ చిత్రానికి సమంతకు భారి మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చినట్టూ చాలా ప్రచారం జరిగింది. అది ఎంత అంటే సమంత ఐదు సినిమాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో అంత ఒక్క సినిమాకే తీసుకున్నట్టు వినికిడి. మరీ ఇప్పుడు తమన్నా ఎంత తీసుకుంటుందో మరీ!.

(Visited 131 times, 1 visits today)