Home / health / మజ్జిగతో అందాన్ని వారం రోజుల్లో పెంచుకోవచ్చు…!

మజ్జిగతో అందాన్ని వారం రోజుల్లో పెంచుకోవచ్చు…!

Author:

మజ్జిగ అనగానే చాలా మందికి అన్నం చివరిలో కలుపుకొని తింటే చాలు అనుకుంటారు లేదా వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో కాస్తా మజ్జిగ తాగితే శరీరం చాలా రిలాక్స్ అవుతుంది అనుకుంటారు కానీ మజ్జిగ ఆరోగ్యానికే కాకుండా చర్మాసౌందర్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.

buttermilk-health-and-beauty-benefits

మజ్జిగ వల్ల మనకి కలిగే ప్రయోజనాలు:

  • మజ్జిగ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో కెలోరీల సంఖ్య తక్కువగా ఉండి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది.
  • మజ్జిగను మన కురులకు పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత తలా స్నానం చేస్తే కురులు నిగనిగలాడుతాయి.
  • మజ్జిగను చర్మానికి రాసుకొని ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
  • అలాగే మజ్జిగను చర్మానికి రాసుకోవడం వలన చర్మం కూడా చాలా మృదువుగా మెరిసిపోతుంది.
  • ఈ మధ్య చాలా మంది బ్యూటిషియన్లు కురులకు, చర్మానికి… అందం పెంపొందించే విషయంలో వారి కష్టమర్లకు మజ్జిగను వాడుతున్నట్టు చాలా మంది తెలియజేశారు.
  • శీతాకాలంలో, వర్షాకాలం లో పెరుగు కానీ మజ్జిగ కానీ మనం ఆహారంలో తీసుకుంటే జలుబు చేస్తోంది అనుకుంటారు కాని మజ్జిగ వలన జలుబు తొందరగా తగ్గుతుంది.
  • మజ్జిగలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.
  • ప్రతిరోజూ మజ్జిగని మొహానికి రాసుకోవడం వల్ల మొహంపై ఉండే నల్లటి మచ్చలు వారం రోజుల్లో తొలగిపోతాయి.
(Visited 2,814 times, 1 visits today)