Home / Latest Alajadi / ఉదయం,సాయంత్రం చన్నీటితో స్నానం చేస్తే కలిగే ఉపయోగాలు !

ఉదయం,సాయంత్రం చన్నీటితో స్నానం చేస్తే కలిగే ఉపయోగాలు !

Author:

ఇది అసలే చలి కాలం ఉదయానే స్నానం చేయాలంటే నీళ్లు చల్లగా ఉంటాయి. చల్లటి నీటిని వేడి చేసుకొని స్నానం చేసేవరకు ఆఫీసుకు, కాలేజీకి లేట్ అవుతుంది. కానీ మీరు కొద్దిగా చలి అనుకుండా చల్లని నీటితో స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు మన ఆరోగ్య నిపుణులు.

bath-with-cold-water

ఒక్కసారి చల్లని నీటితో స్నానం చేయడం వలన కలిగే ఉపయోగాలు చూడండి :

  • ఉదయం లేవాగానే చన్నీటితో స్నానం చేయడం వలన చల్లని నీరు శరీరంపై పడగానే రక్త ప్రసరణ  వ్యవస్థ చాలా చురుకుగా జరుగుతుంది.
  • ఉదయం బద్దకంగా నిద్రలేచిన వారు చన్నీటితో స్నానం చేస్తే రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటారు.
  • చల్లటి నీటితో స్నానం చేయడం వలన  జీవక్రియ రేటు వేగంగా మారి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • చల్లటి నీటి వలన చర్మం ప్రకాశవంతంగా మారడమే కాకుండా తలకు పట్టిన దుమ్ము ధూళి వంటి వాటిని తొలగించి వెంట్రుకలను నిగనిగలాడేలా చేస్తోంది.
  • వ్యాయామం చేసిన అనంతరం చన్నీటితో స్నానం చేయడం వలన శరీర అలసట తగ్గి, కండరాలకు మంచి విశ్రాంతిని అందిస్తుంది.

ఈ విషయాన్ని విదేశీ శాస్త్రవేత్తలు ఎంతో మంది  పై  ఎన్నో పరిశోధనలు జరిపి కనుగొన్నారు. కానీ మన పూర్వికులు ఈ విషయాన్ని ఎప్పుడో కొన్ని వేళా సంవత్సరాల అందరికి చెప్పి కనుగొని అందరికి ఆదర్శంగా నిలిచారు. ఎంతైనా పక్కోడు ఏది చేసిన గ్రేట్ మనోడు ఏదిచేసిన వేస్టు అనుకునే మన వారు. ఎప్పుడైనా  మన వాడు గొప్ప అంటే నమ్మకపోగా వింతగా చుస్తుడంటం కొసమెరుపు.

Must Read: శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని,విష పదార్థాలని 3రోజులలో తగ్గించుకోవచ్చు..!

(Visited 8,982 times, 1 visits today)