Home / health / చిలకడ దుంప వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.

చిలకడ దుంప వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.

Author:

చిలకడదుంపను తినటానికి ఇష్టపడని వారు ఉండరు అనే చెప్పాలి. ఈ దుంపలకు ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. వీటిని మొరంగడ్డ, కందగడ్డ అని కూడా అంటారు. పిండి పదార్థాలను, చక్కెరలను కలిగి ఉండే ఈ ఆహార పదార్థం రుచిని కూడా కలిగి ఉంటుంది. కూరగాయల్లో అత్యంత రుచికరమైన స్నాక్ ఫుడ్ ఏది అంటే చిలకడ దుంప అంటారు. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ ఉండవంటున్నారు. చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. సలాడ్లకూ ఇవి మరింత రుచిని తెచ్చిపెడతాయి. కాబట్టి వీటిని వారానికి కనీసం రెండు సార్లయినా తినటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి కావల్సిన పోషకపదార్థాలను అందించడంలోనే కాదు, వివిధ రకాలుగా శరీరంలో చేరిన విషపదార్థాలను తొలగించడంలో చిలకడ దుంపలకు ప్రత్యేక స్థానం ఉంది.

sweet-potato health benefits

అనేక ఖనిజ లవణాలతో పాటు దుంపలలో పిండి పదార్థాలు(కార్బోహైడ్రేటులు), విటమిన్‌లు(బి,సి,ఇ) ఉన్నాయి. ఇక చిలుగడదుంపలో కార్టినాయిడ్స్‌ మరియు పాలీఫినాల్స్‌ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి. దుంపలో లభించే పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఎదిగే పిల్లలకు స్వీట్‌ పొటాటోను ఉడికించి తినిపించడం వల్ల శరీరంలో ఉన్న విషరసాయనాలు సులభంగా బయటకు పంపిస్తుంది. చిలకడదుంప పొటాషియంను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది హృదయ స్పందన మరియు నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిరులను పొటాషియం తగ్గిస్తుంది.

కడుపు (జీర్ణాశయంలో) ఏర్పరిచే అల్సర్‌లను తగ్గించి వేస్తాయి. ఫైబర్లను అధిక మొత్తంలో కలిగి ఉన్న ఈ పిండి పదార్థాలతో కూడిన ఆహారం, అసిడిటీ సమస్యలను మరియు మలబద్దకం వంటి వాటిని కలుగకుండా చూస్తాయి. విటమిన్ ‘ఎ’, యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉండి, క్యాన్సర్ కలుగచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేయటమే కాకుండా ఈ దుంపలలోని అతినీలలోహిత కిరణాల వలన కలిగే ప్రమాదాల నుండి, మరియు వీటి వలన ప్రమాదానికి గురైన కణాలను భర్తీ చేయటానికి ఈ విటమిన్ సహాయపడుతుంది. బంగాళాదుంప కన్నా చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలోని షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. జీవక్రియల్లో చాలా కీలకమైన మాంగనీసు కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి. మ్యాంగనీస్ ఎముకల బలానికి బాగా సహాయపడుతుంది. కేన్సర్ కణాలను అణచివేయడంలో కూడా ఇందులో లభించే విటమిన్-ఎ చురుకైన పాత్ర పోషిస్తుంది. చిలకడ దుంపలో విటమిన్-డి పుష్కలంగా  ఉండటం వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, మానసిక కల్లోలాలను తగ్గించి, శక్తిని పెంచి, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇంతగా మన శరీరానికి ఉపయోగపడే చిలకడ దుంపలను కనీసం వారానికి రెండు సార్లయినా తినటం మేలని నిపుణులు అంటున్నారు.

(Visited 4,096 times, 1 visits today)