Home / Entertainment / బెంగాల్ టైగర్ కు బెనిఫిట్ ఎంత.

బెంగాల్ టైగర్ కు బెనిఫిట్ ఎంత.

Author:


టాప్ హీరోల సినిమాలకు బిజినెస్ ప్రాబ్లమ్ అంతగా వుండదు. చిన్న సినిమాలు ఖర్చు తక్కువ కాబట్టి ఏదో విధంగా అమ్మేసుకుంటున్నారు . కిక్ 2 లాంటి డిజాస్టర్ తరువాత వస్తున్నరవితేజ సినిమా బెంగాల్ టైగర్. ఒక ఫ్లాప్ తరువాత ఓ రేంజ్ హీరో సినిమాకు బిజినెస్ కావడం అంటే అంత సులువు కాదు. ఆ ఎఫెక్ట్ ఈ సినిమా మీద పడుతుందేమో అనుకున్నారు టాలీవుడ్ జనాలు. కానీ బాగానే బిజినెస్ జరిగిపోయింది. శాటిలైట్ 7.6 కోట్లకు, నైజాం..7.4 కోట్లకు (ఎనిమిది కోట్లు సేల్..60 లక్షలు రిటర్న్ గ్యారంటీ), కర్ణాటక 2.6 కోట్లకు, హిందీ డబ్బింగ్ 2.4 కోట్లకు, ఓవర్ సీస్ 1.35 కోట్లకు, సీడెడ్ 3.6 కోట్లకు అమ్మేసారు. ఆంధ్ర అంతా కలిపి 10 కోట్లకు నిర్మాత…9 కోట్లకు బయ్యర్లు బేరాలాడుకుంటున్నారు. అయితే గుంటూరు,

నెల్లూరుకు మూడుకు బేరం కుదిర్చేసుకున్నారు. వాటితో కలిపి ఆంధ్రకు తొమ్మిదికోట్లే అనుకున్నా కూడా..34 కోట్ల వరకు వస్తోంది. సినిమాకు పబ్లిసిటీ అంతా కలిపి 27వరకు అయినట్లు తెలుస్తోంది. పోనీ ఇంకా ఖర్చులు  వుంటాయి అనుకున్నా కూడా అయిదు కోట్ల వరకు లాభం చేసుకున్నట్లే నిర్మాత రాధామోహన్. కానీ ఆయన వెర్షన్ వేరుగా వుందని వినికిడి. ప్రొడక్షన్ కాస్ట్ మీద లాభం అన్నది డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తోనే రావాలని, ఆపైన శాటిలైట్ వుండాలని లెక్కలు కడుతున్నట్లు వినికిడి.

ఆ విధంగా చూసుకుంటే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మొత్తం పాతిక కోట్లే..ఖర్చుతో చూసుకుంటే, రెండు వరకు డెఫిసిట్. ఈ ఈక్వేషన్ల సంగతి ఎలా వున్నా, ఓ పెద్ద సినిమా టేబుల్ ప్రాఫిట్ తో బయటకు రావడం అంటే ఈ టైమ్ లో సంతోషించాల్సిందే.

(Visited 111 times, 1 visits today)