Home / Entertainment / మన సెల్ఫ్ ప్రమోషన్స్ కంటే మనం చేసిన పనే మాట్లాడాలి-భీమ్స్

మన సెల్ఫ్ ప్రమోషన్స్ కంటే మనం చేసిన పనే మాట్లాడాలి-భీమ్స్

Author:

Music-Director-Bheems-Ceciroleo-Interview-Stills-

ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాలలో టాలెంట్ ని నిరూపించుకుంటూ వస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో. భీమ్స్ తన కెరీర్లో చేసిన మొదటి బిగ్ బడ్జెట్ మూవీ ‘బెంగాల్ టైగర్’. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 10న రిలీజ్ కానుంది.

తన గురించి,సినిమా గురించి కొన్ని విషయాలు తేలియజేస్తు నేను చిన్న చిత్రాలు చేస్తున్నప్పుడే చాలా మంది తెలంగాణవాడినని అనుకున్నారు. అలానే కొనసాగించాను. కానీ ఎక్కడా వివక్షత లేదు. నేను పుట్టింది ఖమ్మంలోనే. నేను సంపత్ నంది చాలా కాలం నుంచి మంచి ఫ్రెండ్స్. గతంలో కూడా తనకి సంబదించిన పలు సినిమాల్లో వర్క్ చేసాను. రవితేజతో ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వగానే సంపత్ నంది నాకు పలు సందర్భాలు ఇచ్చి కొన్ని ట్యూన్స్ రెడీ చేయమన్నాడు. మేమిద్దరం కలిసి ఆ ట్యూన్స్ ని రవితేజ దగ్గరికి తీసుకెళ్ళాం. రవితేజ గారు ఆ ట్యూన్స్ విని అక్కడే నన్ను మెచ్చుకొని, ట్యూన్స్ ఓకే చెయ్యడమే కాకుండా ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ చెయ్యాలని చెప్పి నాకు అవకాశం ఇచ్చారు. అలాగే పాటలు ఓకే అన్నాక సింగర్స్ సెలక్షన్ లో నాకు ఫ్రీడం ఇచ్చిన నిర్మాత రాధా మోహన్ మరియు డైరెక్టర్ సంపత్ నందిలకు స్పెషల్ థాంక్స్ చెప్పాలి. వాళ్ళందరి హెల్ప్ లేకపోతే ఈ బెంగాల్ టైగర్ ఆల్బమ్ ఇంత బాగా వచ్చేది కాదు.

ఇంక తన గురించి మట్లాడుతూ.. మన సెల్ఫ్ ప్రమోషన్స్ కంటే మనం చేసిన పనే మాట్లాడాలి అనుకునే మనస్తత్వం నాది. మీ మ్యూజిక్ నచ్చి, రెగ్యులర్ గా వింటూ ఉంటే ఆడియన్స్ కి మీ పేరు అలా గుర్తుండి పోతుంది. ఎప్పుడైతే ఆడియన్స్ మన వర్క్ ని మెచ్చుకోవడం మొదలు పెడతారో అదే మనకు బిగ్గెస్ట్ గిఫ్ట్ అని ఫీలవుతాను. ఇక స్పెషల్ ఎలిమెంట్స్ అంటే, బాంచన్ సాంగ్ లో తెలుగు రాప్ ట్రై చేసాం, తెలుగు సాంగ్స్ లో అలా ట్రై చేయడం చాలా కొత్త అని చెప్పాలి. అలాగే రొమాంటిక్ సాంగ్ కూడా కొత్తగా ట్రై చేసాం, అది అందరికీ బాగా నచ్చింది. బెంగాల్ టైగర్ అనే సినిమా నా కెరీర్ ని మరో స్టేజ్ కి తీసుకెళ్తుందని భావిస్తున్నాను. నేను రూరల్ ఏరియా నుంచి వచ్చాను, అందుకే నా మ్యూజిక్ లో అనుకోకుండానే ఆ ఫ్లేవర్ మిక్స్ అవుతూ ఉండచ్చు. ప్రస్తుతం వరుసగా చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ నేను ఇంకా ఏదీ కమిట్ అవ్వలేదు. ఈ ఆఫర్స్ లో నా కెరీర్ ని మరో లెవల్ కి తీసుకెళ్ళే సినిమాని సెలక్ట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాను.

(Visited 61 times, 1 visits today)