Home / Entertainment / ‘బెంగాల్ టైగర్’ శాటిలైట్ రైట్స్ కి భారీగా పోటీ

‘బెంగాల్ టైగర్’ శాటిలైట్ రైట్స్ కి భారీగా పోటీ

Author:

Bengal-Tiger

మాస్ మహారాజ్ రవితేజ ఈ పేరు చెప్పితే ఒక్కప్పుడు మినిమం గ్యారేంటి సినిమా, కాని ఈ మద్య లో కొన్ని సినిమాలు బోల్తా కొట్టడంతో పాటు లాస్ట్ సినిమా ‘కిక్ 2’ కూడా తెలుగు ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘బెంగాల్ టైగర్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ కి ముందే బెంగాల్ టైగర్ శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయాయి. అది కూడా ఓ భారీ మొత్తానికి అమ్ముడు పోవడం విశేషం. ప్రముఖ టీవీ ఛానల్స్ మధ్య ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి భారీగా పోటీ నెలకొంది. ఫైనల్ గా జెమిని టీవీ వారు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని 7.5 కోట్లకి కొనుగోలు చేసారు. రిలీజ్ కి ముందే ఈ రేంజ్ ఆఫర్ శాటిలైట్ రైట్స్ కి దక్కడంతో ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉంది. రవితేజ సరసన తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి సంపత్ నంది డైరెక్టర్. రాధా మోహన్ నిర్మించిన ఈ సినిమాకి భీమ్స్ మ్యూజిక్ అందించాడు. దాంతో ఈ చిత్ర టీం జోరుగా ప్రచార కార్యక్రమాలు చేస్తోంది. సినిమా ట్రైలర్స్ క్రియేట్ చేసిన క్రేజ్ వలన ఈ సినిమాకి బిజినెస్ కూడా బాగానే అవ్వడమే కాకుండా భారీ ఎత్తున రిలీజ్ కి కూడా సిద్దమైంది.

(Visited 50 times, 1 visits today)