Home / Reviews / ‘బెంగాల్ టైగర్’ సినిమా రివ్యూ & రేటింగ్.

‘బెంగాల్ టైగర్’ సినిమా రివ్యూ & రేటింగ్.

Alajadi Rating

3/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా, బొమన్ ఇరానీ..

Directed by: సంపత్ నంది

Produced by: కెకె రాధా మోహన్

Banner: Sri Sathya Sai Arts

Music Composed by: భీమ్స్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మిల్కి బ్యూటీ తమన్నా, రాశిఖన్నాలు హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘బెంగాల్ టైగర్’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాధామోహన్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా భిమ్స్ తన సంగీతాన్ని అందించాడు. పృథ్వి, పోసాని కృష్ణ మురళి, బోమన్ ఇరాని ప్రధానపాత్రల్లో నటిస్తున్నరు. కిక్-2 సినిమా ఇచ్చిన చేదు అనుభవం నుండి ‘బెంగాల్ టైగర్’ సినిమా ఇచ్చే సక్సెస్ తో మరచిపోవాలని రవితేజ ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ ఈ రోజు(10న) ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథ విషయానికొస్తే..

కథ:

ఆత్రేయ అనే ఆ ఊరికి పెద్ద అయిన జయనారయన్(నాగినీడు). ఆయన ముగ్గురు కుమారులలో ఒకడైన ఆకాష్ నారాయణ్(రవితేజ) మన హీరో. కంప్యూటర్స్ పూర్తి చేసిన రవితేజ పూర్తి లక్ష్యం అనేది లేకుండా జాలీగా ఫ్రెండ్స్ తో బలాదూర్ తిరుగుతుంటాడు. రవితేజ కి పెళ్లి చేస్తే సెట్ అవుతాడని అక్షతో పెళ్లి చూపులు సెట్ చేస్తారు. రవితేజని పెళ్లి చూపుల్లో చూసిన అక్ష ఈ పెళ్లి చేసుకోనని చెప్తుంది. తను ఫేమస్ కానందువల్లే అక్ష తనతో పెళ్ళికి నిరాకరించిందని తెలుసుకున్న రవితేజ ఎలాగైనా ఫేమస్  అవ్వాలని ఒక రాయితో మినిస్టర్(షియాజీ షిండే)ని ఒక పబ్లిక్ మీటింగ్ లో కొడుతాడు. ఆ వార్త మీడియాలో హైలెట్ అవుతుంది.. దాంతో పోలీసులు రవితేజని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత జైల్లో ఉన్న రవితేజ దగ్గరికి వెళ్లి ఎందుకు కొట్టావని మినిస్టర్ అడిగితే ఫేమస్ అవడానికి అని రవితేజ చెప్పడంతో షియాజీ షాక్ గురై దమ్మున్న కుర్రాడని తన వద్దే ఉంచుకుంటాడు. అలా ఫేమస్ అయిన రవితేజ ని తన టాలెంట్ చూసి, హోం మినిస్టర్ నాగప్ప(రావు రమేష్) తన కుమార్తె శ్రద్ధ(రాశీ ఖన్నా)కి బాడీ గార్డ్ గా పెడతాడు. ఈ జర్నీలో శ్రద్ధ రవితేజ ప్రేమలో పడుతుంది.

కట్ చేస్తే నాగప్ప శ్రద్ధ ప్రేమని అంగీకరించి వారిద్దరికీ పెళ్లి చేయడానికి సిద్దమవుతాడు. కానీ రవితేజ దానికి నో చెప్పి, తను సిఎం అశోక్ గజపతి(బొమన్ ఇరానీ) కుమార్తె మీర(తమన్నా)ని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అసలు సడన్ గా పరిచయమే లేని మీరని ప్రేమిస్తున్నానని రవితేజ ఎందుకు చెప్పాడు.? అసలు ఎందుకు సిఎం అశోక్ గజపతిని రవితేజ టార్గెట్ చేసాడు. అసలు మొదటి నుంచి రవితేజ ఇదంతా కేవలం తను ఫేమస్ అవ్వడం కోసమే చేసాడా? లేక దీని వెనుక ఏదన్నా గతం ఉందా? అనేదే మీరు చూసి తెలుసుకోవాల్సిన కథ.

అలజడి విశ్లేషణ:

మాస్ మహారాజ్ అయిన రవితేజ తన సూపర్ లుక్ ని వదులుకొని డైట్ చేసి బాగా సన్నగా అయిన తర్వాత చేసిన రెండవ సినిమా ఇది. కిక్ 2 లో రవితేజ ఫేస్ లో బాగా ముసలి పోలికలు కనిపించాయి. ఇక సినిమా విషయానికి వస్తే రవితేజ లుక్ అండ్ కాస్ట్యూమ్స్ విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకున్నారు. దానివలన చాలా చోట్ల యంగ్ గా కనిపించినా కొన్ని చోట్ల మాత్రం తన వయసు కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో 90% రవితేజ ఫేస్ యంగ్ గా కనిపించడం కోసం సిజి వర్క్ ని వాడారు అని తెలుస్తుంది. ఇక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే..డైరెక్టర్ ఇదొక రెగ్యులర్ ఫార్మాట్ లో రూపొందించిన కమర్షియల్ సినిమా అని రిలీజ్ కి ముందే చెప్పాడు. దీనిలో రెగ్యులర్ మాస్ ఆడియన్స్ కి నచ్చే అన్ని అంశాలు పొందు పరిచినప్పటికీ ఆడియన్స్ 100% సంతృప్తిచెందరు. చూసేపుడు సీన్స్ కి అక్కడక్కడా బాగా కనెక్ట్ అయినా ఓవరాల్ గా కథ పెద్దగా లేదు అనే ఫీలింగ్ ఆడియన్స్ కి రావడమే ఈ సినిమాకి మొదటి మైనస్. అలాగే స్క్రీన్ ప్లే బేస్ మూవీ అయిన ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ని సూపర్బ్ గా రాసుకొని, సెకండాఫ్ ని మాత్రం ఎందుకో అంత ఎఫ్ఫెక్టివ్ గా రాసుకోలేకపోయాడు. సెకండాఫ్ మొదలైన 10 నిమిషాలకే సినిమా మరీ మరీ రొటీన్ గా మారిపోయి, సాగదీస్తున్న ఫీలింగ్ ని తీసుకు రావడమే కాకుండా ఊహాజనితంగా సాగుతుంది. అది సినిమాకి మరో బిగ్గెస్ట్ మైనస్.

ఇక ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసే కామెడీ ఉంది, కానీ సెకండాఫ్ లో ఆ కామెడీ ఫ్లేవర్ అనేదే పెద్దగా కనిపించదు. సెకండాఫ్ లో కామెడీ లేకపోవడం, తెలిసిన కథ అనే ఫీలింగ్ వలన ఆడియన్స్ బాగా బోర్ ఫీలవుతారు. దానికి తోడూ సెకండాఫ్ లో డైరెక్టర్ దగ్గర కంటెంట్ లేక వరుసగా మూడు పాటలు పెట్టేసాడు. పాటలు చూడటానికి ఓకే కానీ సినిమా ఫ్లోని మాత్రం బాగా దెబ్బ తీస్తాయి. సాగాదీసినట్టున్న సీన్స్ ని కట్ చేసి రన్ టైంని ఇంకాస్త తగ్గించాల్సింది. అలాగే క్లైమాక్స్ అయితే మరీ మరీ రొటీన్ అనిపిస్తుంది. రవితేజ కి మాస్ మసాలా పాత్రలు చేయడం, పంచ్ డైలాగ్స్ చెప్పడం బట్టర్ తో పెట్టిన విద్య. కావున ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా చేసుకొని వెళ్ళిపోయాడు. ఇందులో తను కొత్తగా నటనలో చూపిన వైవిధ్యం ఏమీ లేదు. ఇకపోతే తనకి డిజైన్ చేసిన పాత్ర కూడా కొత్తదేమీ కాదు, గత సినిమాల్లో చేసిన పలు పాత్రలను గుర్తు చేసేలానే ఉంది.. సినిమా మొత్తాన్ని తన పాత్ర, తన డైలాగ్స్, తన పవర్ఫుల్ యాక్షన్ తో ముందుకు నడిపించాడు. గత సినిమాలో మిస్ అయిన రవితేజ మార్క్ కామెడీ, యాక్షన్, మాస్ డైలాగ్స్ ఇందులో చూడచ్చు. ఇక చూడటానికి రవితేజ సన్నగా కనపడినా లుక్ మాత్రం చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. మాస్ మహారాజ్ రవితేజ పాత్రని, ఆ పాత్రలోని పవర్ ని సినిమా ఇంట్రడక్షన్ లోనే చూపించి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చేసేయ్యడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. దాంతో ఆడియన్స్ ఆ పాత్రకి సింక్ అవుతూ సినిమాలో లీనమవుతారు. అక్కడి నుంచి రవితేజ పాత్రని హైలైట్ చేస్తూ పూర్తి ఫన్ ఉండేలా ఫస్ట్ హాఫ్ ని తీర్చిదిద్దిన విధానం సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయ్యింది. ముఖ్యంగా రవితేజ – పృథ్వి – పోసానిల కామెడీ సినిమాలో ఆడియన్స్ నవ్విస్తూ ఫస్ట్ హాఫ్ ని ఎంటర్టైనింగ్ గా సాగేలా చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే 6 నిమిషాల షార్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా బాగుంది. ఇక సెకండాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ డీసెంట్ అనిపిస్తాయి. ఇక తమన్నా ఎక్కువగా తన అందాలతో, అలాగే తనకి ఇచ్చిన చిన్న పాత్రకి నటన పరంగా న్యాయం చేసింది. ముఖ్యంగా ‘చూపులతో దీపాల’ సాంగ్ లో అయితే తమన్నా రవితేజ కనపడకుండా పోయేలా అందాలు ఆరబోసింది. మీరు చూపు తిప్పుకోలేరు. గ్లామర్ డాల్ గా కనిపించింది. తన నటనకి ప్రాధాన్యం ఉన్న సీన్స్ లో బాగానే చేసినా, తనని ఎక్కువగా గ్లామర్ పరంగానే వాడుకోవడం వలన ఆడియన్స్ కి తన అందాల విందు మాత్రమే గుర్తుంటుంది.ఇక రాశీ ఖన్నా కాస్త పొగరున్న పాత్ర చేస్తోంది అనిపించినా ఫైనల్ గా తను కూడా ఓ గ్లామర్ అట్రాక్షన్. రాశీ ఖన్నా కాస్త క్యూట్ క్యూట్ గా ఉన్న పాత్రలో బాగానే చేసింది. అలాగే తను కూడా మోడ్రన్ లుక్ లో అందాలతో ఆకట్టుకుంది. మొదటి సారి రాశీ ఖన్నా కూడా తన గ్లామర్ డోస్ ని పెంచి ఏకంగా బికినీలో కనువిందు చేసింది. ఇక రాజసం చూపే సిఎంగా, తనకు అడ్డొచ్చే వారిని పరలోకాలు పంపే కౄరత్వం ఉన్న మెయిన్ విలన్ గా బొమన్ ఇరానీ చాలా సెటిల్ గా చేసిన పెర్ఫార్మన్స్ సినిమాకి పెద్ద హైలైట్ అయ్యింది. ఇక కమెడియన్స్ లో పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్ పృద్వీ బాగా నవ్వించే ప్రయత్నం చేయగా, సత్యం రాజేష్, శకలక శంకర్ లు పరవాలేధనిపించారు.ఇక అమలా పాల్ గా బ్రహ్మానందం మరోసారి నవ్వించడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. రావు రమేష్, హర్షవర్ధన్ రాణే, నాగినీడు, సాయాజీ షిండే, బ్రహ్మాజీ, పవిత్రా లోకేష్, ప్రియదర్శిని రామ్ లు తమ తమ పాత్రల్లో ఓకే అనిపించారు. ఇక అతిధి పాత్రల్లో కనిపించిన అక్ష, హంసా నందినిలు ఎవరి తరహాలో వారు ఆకట్టుకున్నారు.

నటీనటుల ప్రతిభ:

రవితేజ : రవితేజ పాత్రని, ఆ పాత్రలోని పవర్ ని సినిమా ఇంట్రడక్షన్ లోనే చూపించి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చేసేయ్యడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

తమన్నా : ఇక తమన్నా ఎక్కువగా తన అందాలతో, పాత్రకి నటన పరంగా న్యాయం చేసింది. ముఖ్యంగా ‘చూపులతో దీపాల’ సాంగ్ లో అయితే తమన్నా నుంచి మీరు చూపు తిప్పుకోలేరు.

రాశీ ఖన్నా :క్యూట్ క్యూట్ గా ఉన్న పాత్రలో బాగానే చేసింది. అలాగే తను కూడా మోడ్రన్ లుక్ లో అందాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓ సీఎన్ లో బికినీలో కనిపించి అందరినీ తన మత్తులో పడేసుకుంది.

సిఎంగా హుందా తనాన్ని చూపడంలో, అలాగే సెటిల్ గా నెగటివ్ షేడ్స్ చూపడంలో బొమన్ ఇరానీ సింప్లీ సూపర్బ్. కమెడియన్స్ లో ఫ్యూచర్ స్టార్ గా పృధ్వీ, సెలబ్రిటీ శాస్త్రిగా పోసాని కృష్ణమురళి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ని ఆడియన్స్ కి అందించారు. సత్యం రాజేష్, శకలక శంకర్ లు ఓకే అనిపిస్తే, రావు రమేష్, సాయాజీ షిండే, ప్రియదర్శని రామ్, పవిత్రా లోకేష్, నాగినీడులు పాత్రల మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

కథ – కథనం – మాటలు – దర్శకత్వం, ఈ నాలుగు డీల్ చేసింది సంపత్ నంది. కథలో ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని కొత్తగా అనుకున్నప్పటికీ మిగతా అంతా చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ముందు నుంచే ఇది స్క్రీన్ ప్లే బేస్ కథ అన్నారు, కానీ ఆద్యంతం స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి వచ్చే ఫీలింగ్ సెకండాఫ్ అయ్యేటప్పటికి రాలేదు అంటే సెకండాఫ్ లో ఎక్కడో ఏదో మిస్ అయ్యింది, అదే స్క్రీన్ ప్లే. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయేలా సంపత్ నంది రాసిన డైలాగ్స్ బాగున్నాయి. వన్ లైన్ డైలాగ్స్ బాగా పేలాయి. రొటీన్ కథనే ఎంచుకున్నప్పటికీ డైరెక్టర్ గా మాత్రం రెగ్యులర్ మూవీ లవర్స్ ని సినిమా థియేటర్స్ లో కూర్చునేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.

సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హెల్ప్ అయ్యింది. ప్రతి ఫ్రేం, ప్రతి విజువల్ సినిమాని చాలా గ్రాండ్ గా ఉండేలా చూసుకున్నాయి. ఆ విజువల్స్ కి చిన్నా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రాణం పోసాడు. ఇక భీమ్స్ అందించిన పాటలకి సూపర్బ్ పిక్చరైజేషన్ దొరకడంతో సినిమాకి అవి కూడా విజువల్ గా హెల్ప్ అయ్యాయి. ఎడిటింగ్ లో గౌతమ్ రాజు ఫస్ట్ హాఫ్ మీద చూపిన శ్రద్ధ సెకండాఫ్ లో చూపలేదు. అందుకే సెకండాఫ్ లో సాగదీసిన ఫీలింగ్ ఎక్కువ అనిపిస్తుంది. డివై సత్యనారాయణ ఆర్ట్ వర్క్ బాగుంది. నటీనటులకు చేసిన స్టైలింగ్ బాగుంది. రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అదుర్స్ అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్:

 

  • రవితేజ ఎనర్జిటిక్ మాస్ పెర్ఫార్మన్స్
  • తమన్నా,రాశీ ఖన్నాల అందాలు
  • ఫస్ట్ హాఫ్
  • పోసాని కృష్ణ మురళి, పృధ్వీల కామెడీ

మైనస్ పాయింట్స్:

  • స్టొరీ, స్క్రీన్ ప్లే
  • సెకండాఫ్
  • ఎడిటింగ్

పంచ్ లైన్: సగం గర్జించిన “బెంగాల్ టైగర్”.

(Visited 283 times, 1 visits today)