Home / health / పిల్లల ఎదుగుదల పై అసంతృప్తి గా ఉన్నారా? అయితే వారి పోషణ ఇలా ఉండేలా చూడండి

పిల్లల ఎదుగుదల పై అసంతృప్తి గా ఉన్నారా? అయితే వారి పోషణ ఇలా ఉండేలా చూడండి

Author:

ఎదిగే పిల్లలు ఖచ్చితంగా మంచి పోషణ ఉన్న ఆహారం తీసుకోవాలి. కానీ అందరు పిల్లలు ఒకేలా ఉండరు కదా. అప్పుడు పేరెంట్స్ వారి పోషణ లో లోపం లేకుండా చూడాలి . అన్ని రకాల పళ్ళు, కూరగాయాలు, ఆకుకూరలు పిల్లలకి అలవాటు చేయాలి. వారికి ఆ పోషణ వల్ల కలిగే లాభాలు కూడా చెప్పాలి. ఇలా వారికి అవగాహన కలిగించటం వలన పిల్లలలో ఒక కాన్షియస్నెస్ ఏర్పడుతుంది. రోజూ వారికి మంచి హెల్తీ ఫుడ్ తో డే ని స్టార్ట్ చేయాలి. వారి ఎదుగుదలకి సంబంధించిన కొన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ తెలుసుందాం.

kids food

విటమిన్ ఏ:
వారి శారీరిక బలానికి తేజమైన కంటిచూపుకి విటమిన్ ఏ ఎంతో అవసరం. మరి విటమిన్ ఏ ఉండే పదార్థాలు- పాలు, క్యారెట్ , ఎగ్స్ , పాలకూర , కంద గడ్డ, ఆప్రికాట్స్.. ఇవి వారికి రెగ్యులర్ గా అందిస్తే బలమే కాదు మానసికంగా కూడా ఎంతో ఆక్టివ్ అవుతారు.

విటమిన్ బి:
బాడీ మెటబాలిజం బాగుండాలంటే ఖచ్చితంగా విటమిన్ బి గల ఫుడ్స్ అందించాలి. చేపలు, చికెన్, బ్రెడ్, బ్రవున్ రైస్, ఓట్స్, ఎగ్స్, కూరగాయలు గనక పిల్లలకి అందిస్తే వారి జీర్ణ శక్తి కూడా మెరుగవుతుంది .

విటమిన్ సి:
సి విటమిన్ ఎక్కువగా లభించే నిమ్మకాయ , బత్తాయి , ద్రాక్ష , ,టొమాటోస్ , జామకాయ, కివి , పపాయా లాంటివి తరచుగా పిల్లలకి అందించండి. వీటి ద్వారా పిల్లలు చాలా ఫిట్ గా ఆక్టివ్ గా వుంటారు

కాల్షియం:
ఎముక బలానికి సంభందించిన ఈ కాల్షియం ఫుడ్స్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. పాలు, పెరుగు, ఆల్మండ్స్ , రాగి జావా , జొన్న జావా, స్ప్రౌట్స్, నువ్వులు చాలా ముఖ్యమైన ఆహరం . పిల్లలు జావలు ఇష్ట పడరు కాబట్టి వారికి రాగి పిండి తో మురుకులు, రాగి పిండి లడ్డులు . జొన్న రొట్టెలు , నువ్వు లడ్డులు ఇలా ఇంటరెస్టింగ్ గా చేసి పెట్టండి.

ఐరన్:
చాలా మంది పిల్లలకి ఐరన్ డెఫిషియెన్సీ ఉంటుంది . ఇలా ఉన్న పిల్లలకి తొందరగా నీరసం ఆకలి తగ్గటం లాంటివి జరుగుతాయి. సో పిల్లల్లో ఐరన్ లోపం లేకుండా చూడాలి. అరటి పళ్ళు, బ్రెడ్, రెడ్ మీట్ , ఆకుకూరలు, డ్రై ఫ్రూప్ట్స్ , చేపలు, బీన్స్, పిల్లలకి అందివ్వాలి. ఇలా వారి ఆహారం బలంగా ఉండేలా చూడండి అప్పుడు వారే బలంగా అవుతారు. నేటి బాలలే రేపటి పౌరులు కదా..

(Visited 1,158 times, 1 visits today)