Home / Political / నిద్రపోయే సమయంలో ఎటు వైపు తిరిగి పడుకొవాలి!

నిద్రపోయే సమయంలో ఎటు వైపు తిరిగి పడుకొవాలి!

Author:

12325916_1682415131997948_1497948357_o

             ఈ రోజుల్లో నిద్ర లేమి అందరిని వేధిస్తున్న సమస్య. పగలంతా ఉరుకుల పరుగుల జీవితంతో విశ్రాంతి లేకుండా పని చేసే జనానికి, రాత్రి అయిన  సుఖంగా నిద్రా పోదాం అని అనుకుంటుంటే ఒక మానాన నిద్ర పట్టదు. . ఏ పనిని సమర్థంగా చేయాలన్నా మెదడుకు విశ్రాంతి చాలా అవసరం, ‘ఆకలి రుచి ఎరుగదు…నిద్ర సుఖమెరుగదు’ అంటారు పెద్దలు. కానీ సుఖవంతమైన నిద్ర రావలంటే మనం ఎటువైపు తిరిగి పడుకుంటాం అనేది కూడా ముఖ్యమే అంటున్నారు పరిశోధకులు. ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కటి ఆరోగ్యానికి, చిక్కటి(సుఖవంతమైన) నిద్ర వస్తుందట!. ఎడమ వైపు తిరిగి పడుకునే వారిలో 60% మంది ఉదయం లేచిన తర్వాత సంతోషంగా, చాలా చురుకుగా ఉంటారట! కుడివైపు తిరిగి పడుకునేవారిలో నిద్రలేమి, అశాంతి వంటివి చోటుచేసుకుంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

benefits of good sleeping position

. ఎడమవైపు తిరిగి పడుకుంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుందట
.ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల క్రమేపి గ్యాస్టిక్, ఎసిడిటి మరియు హార్ట్ బర్న్ సమస్యలను కూడా తగ్గుతాయట!
. ఎడమ వైపు నిద్రించడం వల్ల శరీరభాగాలన్నింటికి బ్లడ్ సర్కులేషన్ సరిగా జరిగి గుండె మీద పనిభారం తగ్గుతుంది.
.ఎడమవైపు నిద్ర పోవడం వల్ల చిన్న ప్రేగుల నుండి పెద్దప్రేవుల్లోకి గ్రావిటి ద్వారా వేస్ట్ ప్రోడక్ట్ లు నెట్టబడతాయట.

ఇకనుండి మీరు కూడా  ఎడమ వైపు తిరిగి పడుకొండి మీ ఆరోగ్యన్ని కాపడుకొండి.

(Visited 3,435 times, 1 visits today)