Home / health / జన్యుపరంగా సరైన వీర్యాన్ని ఇవ్వండి 3.5 కోట్లు పట్టుకెళ్ళండి.

జన్యుపరంగా సరైన వీర్యాన్ని ఇవ్వండి 3.5 కోట్లు పట్టుకెళ్ళండి.

Author:

ఎప్పుడైతే స్త్రీల యొక్క అండం మరియు పురుషుడి యొక్క వీర్యం కలిసి చర్యనొందుతాయో అప్పుడే ఒక నూతన ప్రాణి జీవం పోసుకుంటుంది. సంతానం కలగాలంటే మగవారి వీర్యం మరియు స్త్రీల యొక్క అండం తప్పనిసరి. వీర్యలోపం వలన సంతానం కలగని దంపతులు చాలామంది ఉన్నారు మరియు వీర్యదానం చేసేవారికోసం చాలా హాస్పిటల్స్ వేచిచూస్తున్నాయి. కాని మనదేశంలో ప్రజలకు వీర్యదానంపై సరైన అవగాహన లేదు కాని వీర్యదానం పాశ్చాత్య దేశాల్లో చాల కామన్. అలా అన్ని విధాలుగా.. జన్యుపరంగా సరైన వ్యక్తి ఇచ్చే వీర్యానికి రూ. 3.5కోట్లు ఇస్తామని ప్రకటించింది అమెరికాలోని ఓ సంస్థ.

sperm-donate

పుట్టే పిల్లలపై వారి తల్లిదండ్రుల జన్యువుల ప్రభావం చాలా ఉంటుంది. ఈరోజుల్లో సంతానోత్పత్తి లేని వారికి కృత్రిమ గర్భాధారణ ద్వారా పిల్లల్ని పుట్టించడానికి మనదేశంలో కూడా చాలా ఆసుపత్రులు తయరయ్యాయి కాని మంచి వీర్యం ఉంటేగాని సంతానం కలగదు. ఈ క్రమంలోనే అమెరికాలోని డెలావర్‌ ప్రాంతంలోని ప్యురెనెటిక్‌ ఎల్‌ ఎల్‌ సీ అనే సంస్థ నాణ్యమైన వీర్యం మరియు అండాలను దానం చేసేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉన్నత ప్రమాణాలను కలిగి ఉండి లోపం లేని వీర్యం మరియు అండం దానం చేసేవారికి రూ. 3.5కోట్ల రూపాయలు ఇస్తారట. కాని దానం చేసేవారి చదువు, సామర్ధ్యాలు, కుటుంబ నేపథ్యం, ఆరోగ్య పరిస్థితి మరియు డీఎన్‌ఏలను పరిశీలించిన తర్వాతే విజేతను ప్రకటిస్తారట. ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను తమ వెబ్సైట్ లో నమోదు చెసుకొవాలని ప్రకటించింది ఆ అమెరికా సంస్థ.

(Visited 2,613 times, 1 visits today)