Home / Inspiring Stories / భద్రాచలంలో శ్రీ సీతరాముల కళ్యాణ మహోత్సవంలో జరిగే కొన్ని ముఖ్య గట్టాలు

భద్రాచలంలో శ్రీ సీతరాముల కళ్యాణ మహోత్సవంలో జరిగే కొన్ని ముఖ్య గట్టాలు

Author:

bhadrachalam sri rama navami

ఈ రోజు ఎక్కడ చూసిన రామ నామంతో యావత్ భారతం మారుమోగుతుంది. ఇక మన తెలుగు ప్రజల ఇలవేల్పు శ్రీ రాముడు కొలువున్న పుణ్య స్థలం భద్రాచలం. ఈ రోజు శ్రీరామనవమి అంటే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఈ మహోత్సవం చూడటానికి భద్రాచలంకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు.
ఈ మహోత్సవంలో జరిగే కొన్ని ముఖ్య గట్టాలలో మనం కొన్ని చూద్దాం…

  • భక్త రామదాసు సీతారామలక్ష్మణులకు ఆలయం నిర్మించి జైలు పాలయ్యాడు (ప్రజల పన్నుతో కట్టినందుకు గానూ).. కేవలం ఆలయమే కాక దేవతా మూర్తులకు ఆభరణాలు కూడా చేయించాడు ఆ కంచర్ల గోపన్న (రామదాసు). ఇప్పటికీ భద్రాచల ఆలయంలోనున్న మ్యూజియంలో ఈ విశేష ఆభరణాలు ఉన్నాయి…! వీటిని కేవలం ప్రతి ఏటా జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి మాత్రమే బ‌యటకి తీసి స్వామికి అల౦కరిస్తారు. ఇప్పటికీ, ఆ ఆభరణాలు చెక్కు చెదరడంలేదు అంటే అంతా ఆ సీతారాముల మహత్యం.
  • ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణోత్సవానికి జనం దాదాపు 3 లక్షల మంది పెరుగుతూ వస్తున్నారు.
  •  శ్రీ రాముడ్ని తన కీర్తనలతో కొలచి అనిర్వచనీయమైన భక్తికి ప్రతి రూపం అయ్యాడు కంచర్ల గోపన్న. తన భక్తితో శ్రీ రామదాసుగా చిరస్మరణీయుడైనాడు. ఇప్పటికీ, వారి వంశానికి చెందిన పదవ తరం అయిన కంచర్ల శ్రీనివాస రావు  సీతా రాముల కళ్యాణోత్సవానికి వచ్చి తన వంశ ప్రతిష్టను కాపాడుతున్నాడు.
  •  సీతా రాముల కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులు ఇప్పటికే 3 లక్షల లడ్డూలను రిజిష్టర్ చేసుకున్నారు.
  • ఈ రోజు రాములవారి పుట్టిన రోజు మాత్రమే కాదు రాములవారి పుట్టిన రోజు కూడా
  • సీతా రాముల కళ్యాణోత్సవానికి ముత్యాల తలంబ్రాల కోసం ఇప్పటికే 4 లక్షల ముత్యాల ప్యాకెట్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది.
(Visited 578 times, 1 visits today)