Home / Reviews / భలే మంచి రోజుసినిమా రివ్యూ & రేటింగ్.

భలే మంచి రోజుసినిమా రివ్యూ & రేటింగ్.

Author:

Bhale Manchi Roju Movie Perfect Review and Rating

ఘట్టమనేని కుటుంబం మరియు అభిమానుల సపోర్ట్ తో హీరోగా పరిచయమై, విభిన్న తరహా సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో సుధీర్ బాబు నుంచి వచ్చిన మరో సినిమా ‘భలే మంచి రోజు’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా ద్వారా వామిక గబ్బినిహీరోయిన్ గా పరిచయం చేసారు. యంగ్ ప్రొడ్యూసర్స్ అయిన విజయ్ – శశిలు నిమించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఏ రేంజ్ లో కామెడీతో థ్రిల్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

ప్రేమలో మోసపోయిన రామ్ (సుధీర్) తను ప్రేమించిన మాయని (ధన్య బాలకృష్ణ)ని నలుగు తగిలిద్దామని బయల్దేరి ఒక యాక్సిడెంట్ లో ఇరుక్కుంటాడు. అవతలి వ్యక్తి ఒక దాదా (సాయికుమార్). ఈ యాక్సిడెంట్ వలన తను కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన అమ్మాయి సీత (వామిక గబ్బి) పారిపోయిందని ఆ అమ్మాయిని తిరిగి తనకి అప్పగించి ని స్నేహితుడిని తీసుకెళ్ళమని ఆ దాదా వార్నింగ్ ఇవ్వడంతో చేసేదేం లేక కిడ్నాపింగ్ డ్రామాలో పడతాడు. ఎలాగోలా కష్టపడి ఆ అమ్మాయిని పట్టుకొని తీసుకు వెళ్ళేటపుడు ఒక చర్చిలో మాయ వివాహం జరుగుతుందని తెలిసి చర్చిలోకి వెళ్తాడు రామ్. రామ్ తో పాటు అక్కడే ఉన్న సిత కూడా చర్చిలోకి వెళ్తుంది. అయితే చర్చిలో ఉన్న పెళ్లి కొడుకు( కృష్ణ చైతన్య)ని చూసి గన్ తో షూట్ చాయబోతుంది సీత. అసలు సిత అతన్ని ఎందుకు షూట్ చేయాలనుకుంది..? రామ్ సీతని దాదాకి అప్పగించి తన స్నేహితుడిని కాపాడుకుంటాడా లేదా..? అసలు ఆ పెళ్లి జరుగుతుందా..? అనేది తెరమీదే చూడాలి.

అలజడి విశ్లేషణ:

అభిరుచి ఉన్న ఓ కొత్త దర్శకుడి నుంచి ఎలాంటి సినిమా ఆశిస్తామో అలాంటి సినిమానే ‘భలే మంచి రోజు’. కిడ్నాప్ నేపథ్యంలో క్రైమ్ కామెడీ అనగానే స్టోరీ లైన్స్ దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఇక్కడ వైవిధ్యం చూపగలిగేది స్క్రీన్ ప్లే విషయంలోనే. ఆ విషయంలోనే ‘భలే మంచి రోజు’ ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రేక్షకులు ఊహించలేని సర్ ప్రైజ్ ప్యాకేజ్ లా ‘భలే మంచి రోజు’ను మలించాడు శ్రీరామ్. క్రైమ్ కామెడీకి సూటయ్యే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను మలిచాడీ కుర్ర డైరెక్టర్. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కామెడీ చాలా పార్ట్స్ లో బాగా వర్కౌట్ అయ్యింది. అలా అని రెగ్యులర్ స్టైల్ లో పంచ్ డైలాగ్స్ తో కూడిన కామెడీ కాకుండా సందర్భానుసారంగా వచ్చే కామెడీ ఎక్కువగా సినిమాలో ఉండడం వలన ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ పెదవులపై నవ్వు కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా సినిమాని మొదలు పెట్టడం ఆసక్తికరంగా ఉంది. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ ని ఆసక్తికర మలుపులతో బాగానే లాక్కొచ్చాడు. ఇక ఇంటర్వల్ బ్లాక్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక క్లైమాక్స్ 20 నిమిషాలని ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకోవడం సినిమాకి అల్టిమేట్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ప్రతి ఒక్క పాత్రని రాసుకున్న విధానం, దాన్ని ప్రెజంట్ చేసిన విధానమే సినిమాకి పెద్ద హైలైట్.

ప్రతి సినిమాలోనూ ఓ డిఫరెంట్ రోల్ ట్రై చేస్తున్న సుధీర్ బాబు ఈ సినిమాలో ఓ లవ్ ఫెయిల్యూర్ కుర్రాడిగా కనిపించాడు. చెప్పాలంటే ఇందులో కూసింత కామెడీ టచ్ ఉన్న పాత్ర చేసాడు. చాలా సందర్భాలలో సుదీర్ బాబు హావ భావాలు చాలా మెచ్యూర్ గా ఉంటాయి. ఓవరాల్ గా ఈ సినిమా కథకి సుధీర్ బాబు పూర్తి న్యాయం చేసాడు. పంజాబీ అమ్మాయి అయిన వామిక గబ్బి చూడటానికి ముద్దుగా బొద్దుగా ఉంది. కానీ ఈ అమ్మాయిలోని ఈజ్ & ఎనర్జీ లెవల్స్ మాత్రం సూపర్బ్. తను సినిమాలో చాలా సేపు ఉన్నా ఎక్కువగా మాట్లాడేది మాత్రం మూడు సన్నివేశాలే. ఆ 3 సన్నివేశాల్లో తన డైలాగ్స్ బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా ఓ సీన్ లో తను తిట్టే తిట్లు థియేటర్స్ లో నవ్వులు పూయిస్తాయి.అలాగే సినిమాలో సాంగ్స్ చాలా చాలా ఎక్కువైపోయాయి, దానివలన చాలా సాంగ్స్ కి సందర్భం అనేది సరిగా కుదరలేదు. మెయిన్ గా సినిమా వేగాన్ని తగ్గించి ఉన్న ఫ్లో ని మిస్ చేయడంలో సాంగ్స్ కీ రోల్ పోషించాయి. సాయి కుమార్ – ఐశ్వర్యల మధ్య రాసుకున్న ట్రాక్ కాస్త చీప్ గా అనిపిస్తుంది. అసలు ఓవరాల్ గా సినిమాలో ఇంకా బెటర్ గా ఫన్ జెనరేట్ చేసే చాన్స్ ఉంది కానీ ఆ స్థాయిలో రాసుకోవడం వలన కామెడీ ఇంకాస్త ఉండాల్సింది అనే ఫీలింగ్ ఆడియన్స్ కి వస్తుంది. లాగే ఈ థ్రిల్లర్ కథలో థ్రిల్స్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది.ప్రథమార్ధంలో కథ టేకాఫ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. పోసాని పాత్ర ఎంటరయ్యే వరకు ప్రేక్షకుడిలో ఉత్సాహం రాదు. ఐతే ఒక్కసారి ఊపు వచ్చాక మాత్రం సినిమా ఎక్కడా ఆగదు. ఇంటర్వల్ ట్విస్ట్ ఆసక్తి రేపుతుంది. ఇక ద్వితీయార్ధమంతా ట్విస్టులే ట్విస్టులు. ఒక్క రోజులో ముగిసిపోయే సినిమా అని చెప్పి.. లెంగ్తీ ఫ్లాష్ బ్యాక్ లతో పాత కథలతో బండి నడిపించే ప్రయత్నం చేయలేదు. సింపుల్ గా ముగిసిపోయే చిన్న హీరో ఫ్లాష్ బ్యాక్ మినహాయిస్తే మిగతాదంతా వర్తమానంలోనే నడుస్తుంది. హీరో హీరోయిన్ల లవ్ స్టోరీకి ప్రత్యేకంగా ట్రాక్ ఏమీ నడపకుండా కథనంలో భాగంగానే చాలా తక్కువ సన్నివేశాలతో లవ్ స్టోరీ బిల్డ్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో కొన్ని డల్ మూమెంట్స్.. అనవసర పాటలు ఇబ్బంది పెట్టినా.. క్లైమాక్స్ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలుస్తుంది. ఇక సినిమా చివర్లో వచ్చే 30 ఇయర్స్ పృధ్వీ సినిమా క్లైమాక్స్ లో పగలబడి నవ్వించేలా చేసాడు. సుధీర్ బాబుకి సపోర్ట్ గా నటించిన ప్రవీణ్, వేణు, శ్రీరామ్, విద్యుల్లేక, పోసాని కృష్ణమురళిలు తమ పాత్రల్లో ఓ మోస్తరుగా నవ్వించారు. పరుచూరి గోపాలకృష్ణ చేసింది మూడు నాలుగు సీన్స్ అయినా తన పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్స్ నవ్విస్తాయి. ధన్య బాలకృష్ణ, చైతన్య కృష్ణలు పరవాలేధనిపించారు.

సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తిగా, అక్కడక్కడా ఎంటర్టైన్మెంట్ తో బాగా సాగుతుంది. అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా సెకండాఫ్ మీద ఆసక్తి పెంచుతుంది. ఇక సెకండాఫ్ తో పాటు సినిమాకే హైలైట్ అయ్యింది క్లైమాక్స్ లో పృధ్వీ చేసిన కామెడీ ఎపిసోడ్. అలా అలా సాగుతున్న సినిమాని ఒక్కసారిగా నవ్విస్తూంటాయి.

నటీ నటుల పని తీరు:

సుదీర్: చాలా సందర్భాలలో సుదీర్ బాబు హావ భావాలు చాలా మెచ్యూర్ గా ఉంటాయి.తన మైనస్ లను కవర్ చేసుకుని పాత్రకు తగ్గట్లు నటించాడు. హై పిచ్ తో డైలాగులు చెప్పేటపుడు అతడి బలహీనత ఇందులోనూ కనిపించింది కానీ.. నటన పరంగా మాత్రం బాగా చేశాడు. ఓవరాల్ గా ఈ సినిమా కథకి సుధీర్ బాబు పూర్తి న్యాయం చేసాడు.

వామిక గబ్బి: పంజాబీ అమ్మాయి అయిన వామిక గబ్బి చూడటానికి ముద్దుగా బొద్దుగా ఉంది. వామికా గబ్బి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎప్పుడూ చేతులు కట్టేసి నోరు మూసేసి ఉన్న పాత్ర ఆమెది. అమ్మాయిలోని ఈజ్ & ఎనర్జీ లెవల్స్ మాత్రం సూపర్బ్.

ఇక సీనియర్ యాక్టర్ అయిన సాయి కుమార్ విలన్ గా చాలా బాగా చేసాడు. ఇక సినిమా చివర్లో వచ్చే 30 ఇయర్స్ పృధ్వీ సినిమా క్లైమాక్స్ లో పగలబడి నవ్వించేలా చేసాడు. సుధీర్ బాబుకి సపోర్ట్ గా నటించిన ప్రవీణ్, వేణు, శ్రీరామ్, విద్యుల్లేక, పోసాని కృష్ణమురళిలు తమ పాత్రల్లో ఓ మోస్తరుగా నవ్వించారు. పరుచూరి గోపాలకృష్ణ చేసింది మూడు నాలుగు సీన్స్ అయినా తన పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్స్ నవ్విస్తాయి. ధన్య బాలకృష్ణ, చైతన్య కృష్ణలు పరవాలేధనిపించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

విశ్వరూపం’ ఫేమ్ శాందత్ సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. ఎప్పుడూ కలర్ఫుల్ విజువల్స్ చూస్తున్న తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా సినిమాటోగ్రఫీ కాస్త కొత్తగా అనిపిస్తుంది.ఛేజింగ్ సీన్లు సహా ప్రతి సన్నివేశంలోనూ కెమెరా పనితనం కనిపిస్తుంది. క్లోజప్ షాట్లను చాలా బాగా తీశాడు. డార్క్ క్రైమ్ కామెడీ మూవీ కావడం వలన వాడిన లొకేషన్స్, ఆ లొకేషన్స్ ని చూపిన విధానం చాలా ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది.. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ క్రియేట్ చేసిన సెట్స్ మరియు షూట్ కోసం సెలక్ట్ చేసిన లొకేషన్స్ సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఆర్ట్ వర్క్ కూడా సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. లొకేషన్లు ఎక్కడా మొనాటనీ అనిపించకుండా డిజైన్ చేశారు.

సన్నీ ఎం.ఆర్. పాటలు పర్వాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్. కొన్ని చోట్ల లౌడ్ నెస్ ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది కానీ జానర్ కు తగ్గట్లు వైవిధ్యమైన ఎంగేజింగ్ రీరికార్డింగ్ తో ఆకట్టుకున్నాడు సన్నీ. విజువల్ గా చాలా కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి. కానీ సందర్భాలే సింక్ అవ్వలేదు. ఇక తను ఇచ్చిన నేపధ్య సంగీతం సినిమాకి చాలా 90% ప్లస్, 10% ఇనుస్ ఎందుకు అంటే కొన్ని చోట్ల డైలాగ్స్ వినపడకుండా తను చేసిన రీ రికార్డింగ్ మాత్రం బాలేదు.

ఇక దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తొలి సినిమాతోనే బలమైన ముద్ర వేశాడు.ఇక నూతన దర్శకుడైన కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను డీల్ చేసాడు. కథ – చాలా బాగుంది అనుకునేలా లేదు. ఎందుకంటే ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో కిడ్నాప్, కామెడీ, థ్రిల్స్ ని ఓకే అనేలా ఉన్నాయి, కానీ థ్రిల్స్ సూపర్బ్ అనేలా రాసుకొని ఉండాల్సింది తొలి సినిమాకు ఏదో సేఫ్ గేమ్ ఆడేయకుండా ఓ భిన్నమైన సినిమాను అందించాలనే శ్రీరామ్ తపనకు అభినందనలు తెలపాలి. అతడి దగ్గర ఫ్రెష్ ఐడియాస్ ఉన్నాయి. ఆ ఐడియాలన్నింటినీ తెలివిగా సినిమాలో ప్లేస్ చేశాడు. క్రైమ్ కామెడీ జానర్ పై అతడికున్న గ్రిప్ ప్రతి సన్నివేశంలో తెలుస్తుంది.. కథనం – ఫస్ట్ హాఫ్ పరంగా చాలా బాగా రాసుకున్న శ్రీరామ్ సెకండాఫ్ లో కాస్త తడబడ్డాడు. ఇక డైరెక్టర్ గా నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలోనే కాదు, ఓ డీసెంట్, డిఫరెంట్ అటెంప్ట్ సినిమాని అందించడంలో సక్సెస్ అయ్యాడు.

ప్లస్ పాయింట్స్:

  •  సుధీర్ బాబు
  • ఇంటర్వల్ బ్లాక్
  • క్లైమాక్స్
  • 30 ఇయర్స్ పృధ్వీ
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • కథనం
  • సాంగ్స్
  • సాయి కుమార్ – ఐశ్వర్యల మధ్య రాసుకున్న ట్రాక్.

అలజడి రేటింగ్: 3/5

                                        పంచ్ లైన్:   భలే మంచి రోజు – భలే మంచి సినిమా.

(Visited 400 times, 1 visits today)