తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలే తీసినా గుర్తుండి పోయే హీరోయిన్లు తక్కువ మందే ఉంటారు. అందులోనూ అందాల ఆరబోతే నటన అనుకోకుండా తమ హుందాతనాన్ని కోల్పోకుండా ఎక్ స్పొజింగ్ కి దూరంగా ఉన్న వాళ్ళు మరీతక్కువ, సౌందర్య తర్వాత ఎక్స్ పోజింగ్ కి ఒప్పుకోకుండా ఎక్కువ కాలం నిలబడ్డ హీరోయిన్ లు తక్కువ అనే చెప్పొచ్చు. తెలుగమ్మాయి లయ, మళయాలీ అమ్మాయి కళ్యాణీ…. ఇలా ఇండస్ట్రీ లో ఉన్న కొద్దిమందిలో ఉన్నది తక్కువ కాలమే అయినా ఎక్కడా అసభ్యతకి తావు లేకుండా చక్కగా కనిపించిన అమ్మాయి శరణ్యా మోహన్. తమిళం లోనూ తెలుగుగులోనూ చేసినవి తక్కువ సినిమాలే అయినా పక్కా తెలుగమ్మాయి లనే కనిపించే ఈ మళయాళ కుట్టి నాని హీరోగా వచ్చిన ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాతో పాటు ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘హ్యాపీ హ్యాపీగా’ చిత్రాల్లో కథానాయికగా, కత్తి చిత్రంలో కళ్యాణ్ రామ్ చెల్లిగా నటించింది. భీమిలి కబడ్డీ జట్టు సినిమాలోనూ, ఫ్యాట్టీ క్యూట్ హీరో కృష్ణుడు తో చేసిన విలేజ్ లో వినాయకుడు సినిమాలోనూ తన నటనకి మంచి మార్కులే పడ్డాయి. కానీ తర్వాత పెద్దగా అవకాశాలేం పలకరించలేదు.
ఎప్పట్లాగే స్కిన్ షో చేయని అమ్మాయిలకి తెలుగులో అవకాశాలు లేక పోవడంతో తమిళ, మళయాలం చిత్రాల వైపు మళ్లింది. అక్కడ కూడా ఆమె కెరీర్ ఆశించిన స్థాయి లో సాగలేదు.ఇక లాభం లేదనుకున్న శరణ్యా మోహన్ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవాలనుకుండట. చిన్న నాటి స్నేహితుడే అయిన అరవింద్ కృష్ణన్ తోనే జీవితాన్ని పంచుకోవటానికి రెడీ ఐపోయింది.వృత్తిరీత్యా డాక్టర్ అయిన అరవింద్ కృష్ణన్ ని ఈ ఆదివారం పెళ్ళీచేసేసుకుంది. జులై 12న వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అరవింద్ కృష్ణన్ తో పెళ్లి విషయాన్ని శరణ్య తన సోషల్ నెట్ వర్కింగ్ పేజీ ద్వారా వెల్లడించింది.తమ పెళ్ళిఫొటోలనూ,వీడియోనూ అప్ లోడ్ చేసి తన్ పేరు శరణ్య మోహన్ నుండి శరణ్యకృష్ణన్ గా మారిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు…
శరణ్యా మోహన్, అరవింద్ చిన్న నాటి నుండి స్నేహితులు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం శరణ్య-అరవింద్ దంపతులు తమ స్నేహితులకు, సన్నిహితులకు గ్రాండ్ గా పార్టీ ఇవ్వబోతున్నారు. వీరిది ప్రేమ వివాహమే అయినా పెద్దలు ఒప్పుకున్నారు..సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. మొదట హీరోయిన్ గా వచ్చిన శరణ్యా మోహన్ తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలే లేక పోవడంతో ఇతర పాత్రలు సైతం చేసింది.