Home / Entertainment / Video: బిగ్ బాస్ షో మొత్తంలో ఇదే ది బెస్ట్ ఎపిసోడ్..!

Video: బిగ్ బాస్ షో మొత్తంలో ఇదే ది బెస్ట్ ఎపిసోడ్..!

Author:

బిగ్ బాస్ షోలో నిన్న (Sep 12 th ) వచ్చిన ఎపిసోడ్ మాత్రం మిగిలిన అన్ని ఎపిసోడ్ ల కంటే భిన్నమైనది, ఎన్టీఆర్ వచ్చే శనివారం, ఆదివారం తప్పించి మిగిలిన వీక్ డేస్ లలో కొద్దిగా బోర్ కొట్టించే బిగ్ బాస్ షో నిన్న మాత్రం అదిరిపోయింది, షోలో అందరు గెలవటం కోసం ప్లాన్ ప్రకారం నటిస్తూ లేదా జీవిస్తూ ఉన్నారనేది నిజం, కానీ మంగళవారం నాటి ఎపిసోడ్ లో మనుషుల మధ్య అనుబంధాలు ఎలా ఉంటాయో చూపించారు.

కంటెస్టంట్లకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు, అదేమిటంటే బిగ్‌బాస్ చెప్పినప్పుడుల్లా అందరు ఉన్నఫళంగా ఫ్రీజ్ అయిపోవాలి, ఫాస్ట్ ఫార్వర్డ్, రీవైండ్, స్లోమోషన్ చేయాలి, రిలీజ్ అన్నప్పుడే మాములు స్థితికి రావాలి ఇది టాస్క్, ఇలా టాస్క్ జరుగుతున్నప్పుడు మొదట శివబాలాజీ భార్య స్వప్నమాధురి (మధుమతి) హౌస్ లోకి ఎంటరైంది… చాలారోజుల తరువాత భార్యాభర్తల కలయిక, అదొక ఎమోషన్…మొదటినుండి షోలో చాలా స్ట్రాంగ్ గా ఉన్న శివ బాలాజీ తన భార్యని చూడగానే మొదటిసారి భావోద్వేగంతో ఏడ్చేశాడు అదొక రియల్ ఎమోషన్.

బిగ్ బాస్

కొద్దీ సేపటికి ఆదర్శ్ భార్య షో లోకి ఎంటరైంది, ఆమెని చూడగానే ఆదర్శ్ మొహంలో ఒక వెలుగు, ఆమె కొద్దిసేపటికే షో నుండి వెళ్ళిపోయి ఆ తరువాత తన కొడుకుతో మళ్ళీ వచ్చింది, కొడుకుని చూడగానే ఆదర్శ్ చాలా భావోద్వేగానికి గురయ్యాడు, భార్య, కొడుకు, భర్త మధ్యలో మరొక రియల్ ఎమోషన్.. ఇవన్నీ ప్లాన్ ప్రకారం వచ్చేవి కాదు మనుషుల మధ్య ఉండే అనుబంధాల వాళ్ళ వచ్చే ఎమోషన్స్, షో చివర్లో అర్చన వాళ్ళ అమ్మ కూడా వచ్చింది తను కూడా ఫుల్ ఏడ్చేసింది, వీరిని చూస్తున్న మిగతా కంటెస్టంట్లలో కూడా ఒక రకమైన రియల్ ఎమోషన్ కనిపించింది, వారితో పాటు షోని చూస్తున్న ప్రేక్షకులలో కూడా ఒక రకమైన ఎమోషన్ కలిగే ఉంటుంది, మొత్తానికి తొలిసారిగా మనుషుల అనుబంధాలతో కూడిన ఓ ఎపిసోడ్ చాలా బాగుంది, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఇలాగే ఉండబోతుంది, ముఖ్యంగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అనే బంధంతో ఒక్కటయ్యిన వారి మధ్య ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో ఈ ఎపిసోడ్ చూపించింది.

Watch Bigg Boss episode 59 Online on hotstar.com

Watch Bigg Boss episode 59 A Big Surprise for Adarsh! only on hotstar – the one-stop destination for your favourite Star Maa shows


ఇన్ని రోజులు టాస్క్ లు, గొడవలు, ఏడుపులు, నవ్వులుతో అలరించిన బిగ్ బాస్ షో మొదటిసారి మనస్సుని తాకింది, బిగ్ బాస్ నువ్వు నిజంగా బిగ్ బాస్ వే…!

(Visited 3,302 times, 1 visits today)