Home / Entertainment / తెలంగాణ సీఎం కెసిఆర్ జీవిత చరిత్ర పై సినిమా.

తెలంగాణ సీఎం కెసిఆర్ జీవిత చరిత్ర పై సినిమా.

Author:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యంత్రి కేసీఆర్ చూడటానికి మామూలు వ్యక్తిలా కనిపించిన అతనొక శక్తి. ఎవరికీ భయపడని తత్త్వం అతనిలో మనకు కనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నా అన్యాయాన్ని చూసి, తెలంగాణ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వెనుకబాటుతనం.. వలనే ఇలా చేస్తున్నారని అందుకే మన రాష్ట్రం మనకు కావలి అప్పుడే మనం తలా ఎత్తుకు తిరుగుతాం అని అందరిని ఒక్క తాటిపై తీసుకువచ్చి ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నాడు.ఇక తెలంగాణను ప్రకటించి పెండింగ్ లో పెట్టిన అప్పటి యూపీఏ కేంద్ర ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకోవడానికి వెళ్లే సమయంలో ఈ సారి కేసీఆర్ సచ్చుడో లేదా తెలంగాణ వచ్చుడో ఎదో ఒకటి జరగందే ఢిల్లీ నుండి వచ్చుడే లేదని చెప్పి మరి వెళ్లి తెలంగాణను సాధించి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ది.

kcr-biopic

ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నట్టు మధుర శ్రీధర్ తెలిపాడు. ఈ సినిమాను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చే జూన్ 2 న మొదలు పెట్టి 2018 లో కేసీఆర్ జన్మదిన కానుకగా ఫిబ్రవరి 17 న విడుదల చేస్తామని మధుర తెలిపాడు. ఈ సినిమాలో కేసీఆర్ రాజాకీయ జీవితం, ఒకపార్టీ నుండి విడిపోయి టీఆరెస్ పార్టీని స్థాపించి తెలంగాణ కోసంపోరాటం చేయడం, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా భాద్యతలు, బంగారు తెలంగాణ లక్ష్య సాధన వంటి విషయాలు ఉంటాయి అని తెలిపాడు. ఈ సినిమాను పెళ్లి చూపుల నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్నాడు.

(Visited 460 times, 1 visits today)