Home / Inspiring Stories / మన ఇజ్జత్ కే సవాల్ అంటున్న సత్తి.

మన ఇజ్జత్ కే సవాల్ అంటున్న సత్తి.

Author:


సత్తి సారు పొద్దుగాల పొద్దుగాలనే రోడ్ల మీద వడ్దదు ఏడ గింత పొక్కున్న ఉశ్కే వోసి కూడుపుతాందు. ఇవ్వన్ని జేసుకుంటనే కోత్త కమీషనర్ జనార్థన్ సార్ తానికి పోతుందు. ఎందుకంటరా..? హైద్రవాదు అద్దం లెక్కున్నది అద్వానగ జెయ్యిమంటడాట. ఏ..! చీ..! కాదు కాదు ఐద్రవాదు అద్వానంగున్నది అద్దం లెక్క చెయ్యిమంటడాట. ఆళ్ళు ఉత్తగనే కూసన్నరా చేత్తనే ఉంటరు కదా,వోత్లున్న కాడ అభివృద్ది ఉంటది తమ్మీ అని సావిత్రి ఏదొ శెప్పవొయింది గనీ “ఎన్నిసార్లు ఓట్లు రాలే ఎన్ని సార్ల పోలే అయినా రోడ్లు గిట్లనే ఉండే అనవట్టిండు.ఊళ్ళెకెళ్ళి అచ్చిన జంగడు (ఆళ్ళ  దోస్తు అన్నట్టు) గీ సిటి ల గబ్బు వాసనకు ఒక్కతేఅ ఉరుకుడురికిండాట.మస్తు షేం ఫీలింగన్నట్టు ఇప్పుడు సత్తికి.

అయినా మొన్ననే అచ్చిన కమీష్నర్ సారుకు ఇప్పుడే గీ పర్షాన్ ఎం మనుసున వడ్తది తమ్మీ అంటే… కమీషనర్ సారు కొలువుకు కొత్త గావచ్చు గనీ పట్నానికి పాతోడే కదా. అన్ని అర్థం చేస్కుంటడు అటుండు మల్ల… తెలంగాణచ్చి రెండేన్లైతుంది ఇంక గిట్లనే రోడ్లుంటే మన ఇజ్జతి పోదా అంటుందు గా ముచ్చటేందో మీరే ఇనున్లి ఇగ…

(Visited 86 times, 1 visits today)