Home / Inspiring Stories / సత్తికి గింత కోపం ఎందుకచ్చింది??

సత్తికి గింత కోపం ఎందుకచ్చింది??

Author:


అగో.. ఈ బిత్తిరి సత్తి కి మస్తు కోపమచ్చిందుల్లో.. గిదేం కర్మమో ఏమొ ఎవ్వలు మాట్లాడినా “ఖతం ఇగ అంత అయిపొయినట్టే ఇగ ఏం లేదు” అనుకుంట ఏడుత్తున్నడు. కేజీ టూ పీ జీ విధ్య ఒక్కటి తప్పిస్తే మానిఫెస్టోలో చెప్పిన పనులన్నీ అయ్పోయినట్టే అని మొన్న సీయెం కేసీ ఆర్ సారు చెప్పిండు గద ఖతం ఇగ గా మాట ఇన్నకాన్నుంచి మన బిత్తిరి సత్తి పిస లేశినట్టే తయారయ్యిండు… మొత్తం అయిపోయింది అంటే ఇగ ఇంకేంది నాకు అచ్చే ఇల్లు సంగతి గాల్లె కల్శినట్టే అని ఏడ్వబట్టిండు. అరే మొత్తం అయ్పోవుడూ అంటే మ్యానిఫెస్టోల ఉన్న పనులన్నీ అమలు అయియానయ్ అన్నట్టు.., పనులన్నీ మొదలు అవుడు అని సావిత్రి ఎన్ని చెప్పినా ఇంటనే లేడు.. మీదికెల్లి నీకెవలన్న ఫోన్ జేశి బుదరకిచ్చిన్లా (బతిమి లాడి కన్విన్స్ చేసిన్లా) అని కోపానికత్తాండు..

ఔ గనీ ఎకురాలకెకురాలు గుల్లకు గోపురాలుకు ఇచ్చి నంక మరి దళితులకు ఇచ్చెతందుకు భూములు దొరుకుతలెవ్వు అన్న మాట గిట్ల ఎవలన్న సత్తికి జెప్పేరుల్లో మల్ల అందర్ని కొట్టెటట్టే ఉన్నడు.

(Visited 79 times, 1 visits today)