Home / Entertainment / చిరంజీవే స్వయంగా వంట చేసి పెడుతాడు నాకు అంటున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు.

చిరంజీవే స్వయంగా వంట చేసి పెడుతాడు నాకు అంటున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు.

Author:

Vivek Oberoy about Chiranjeevi

వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ నటులలో మంచి నటుడిగా నిరుపించుకున్న హీరో. కొన్నిరోజుల క్రితం వర్మ దర్శకత్వం వహించిన ‘రక్తచరిత్ర’ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ రాజకీయ నాయకుడు పరిటాల రవి పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

వివేక్ ఒబెరాయ్ బ్యాంకు చోర్, ఏక్తా గ్యాంగ్ స్టార్, గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రాల్లో నటిస్తూ బిజిగా ఉన్న తను దత్తత తీసుకున్న అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని ముత్తవకుంట్ల గ్రామానికి అప్పుడుడప్పుడు వచ్చివెళ్తుంటాడు. ఈ మధ్యాల వచ్చినప్పుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు వివేక్ ఇక తనకు టాలీవుడ్ లో రామ్ చరణ్, మహేష్ బాబు దగ్గుబాటి రానాలు మంచి స్నేహితులని చెప్పుకొచ్చాడు. చిరంజీవి సినిమాల్లో మాత్రమే మెగాస్టార్ కాదని, అతని మనసుతో పాటు చిరు వంట చేయడంలోనూ మెగాస్టారేనని వివేక్ ఒబెరాయ్ చెప్పుకొచ్చాడు. చిరు వంట భలే చేస్తాడని, హైదరాబాద్ కి వచ్చినపుడు చిరు ఇంటికి వెళ్తుంటానని తన కోసం చిరంజీవే స్వయంగా వంట చేసి పెడుతాడని వివేక్ ఒబెరాయ్ గుర్తు చేసుకున్నాడు.

(Visited 80 times, 1 visits today)