ఇటీవల ప్రియుడి మోజులో పడి భార్యలు, తమ భర్తలను కడతేర్చుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ గా ఉత్తర్ ప్రదేశ్ లోని ముజ్జాఫర్ నగర్ లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.
భర్త వారి అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించినందుకు గాను, వీరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రవిందర్ కుమార్ వీరికి ఈ శిక్ష విధించారు. అంతేకాక రహీస, ఆమె ప్రేమికుడు రిజ్వాన్ కు రూ.7000 జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఐపీఎస్ సెక్షన్లు 302(హత్యానేరం), 201(సాక్ష్యాలు కనుమరుగు చేయడం) కింద ఈ శిక్ష విధించారు.
ప్రాసిక్యూషన్ ప్రకారం, రహీస, ప్రియుడి రిజ్వాన్ తో కలిసి తన భర్త షానవాజ్ ను 2010 జూన్ 15న హతమార్చింది. ఆ తర్వాత సాక్ష్యాలను కనుమరుగు చేసింది. షానవాజ్ దుకాణదారుడు. రహీస, రిజ్వాన్‌ల అక్రమ సంబంధాన్ని అతను వ్యతిరేకించాడు. షానవాజ్ హత్యపై అతని తమ్ముడు ఇస్లామ్ ఫిర్యాదు చేయడంతో .. FIR దాఖలు చేశారు పోలీసులు.