Home / Latest Alajadi / బాలుడి ప్రాణం తీసిన రియాలిటీ షో.

బాలుడి ప్రాణం తీసిన రియాలిటీ షో.

Author:

టీవీల్లో ప్రసారం అయ్యే రియాలిటీ షోలు ఎంత పాపులర్ అయ్యాయో చెప్పాల్సినా అవసరంలేదు.సామన్యులకు లేని టలెంట్ చూపిస్తూ అందరిని అలరిస్తునాయి. కాని అలాంటి షోలలో చూపించే విన్యాసాలను అనుకరించి కొందరు చిన్నారులు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు అనేకం చూసాము. ఛానల్స్ లలో, యూట్యూబ్‌ లలో రియాల్టీ షో లను చూసి అలాంటి వాటిని చేస్తూ కరీంనగర్ కు చెందిన పన్నెండేళ్ల బాలుడు మృతి చెందాడు.

boy-dies-experimenting-reality-show-scene

కొత్త జిల్లా అయిన పెద్దపల్లిలోని అబ్బాపూర్ గ్రామనికి చెందిన పన్నెండేళ్ల కోడూరి ఘనశ్యాం కరీంనగర్ లో చదువుకుంటున్నాడు, తనకు టీవీలలో వచ్చే రియాల్టీ షోలంటే చాలా ఇష్టం. ఇలాంటి షోలు ఎప్పుడైనా మిస్ అయితే యూట్యూబ్‌లో చూస్తుంటాడు. అలా యూట్యూబ్‌లో ఒక విన్యాసం చూసి చేయాలనుకున్నాడు. ఈ నెల 17 వ తేదీన అందరూ నిద్రిస్తున్న సమయంలో వంటింట్లోకి వెళ్లి కిరోసిన్, ఒక క్యాడిల్ ని పట్టు కొని ఇంటి నుండి బయటకి వచ్చి నోట్లో కిరోసిన్ పోసుకొని వెలుగుతున్న క్యాడిల్ పైకి ఊదాడు. అలా ఊదిన వెంటనే పెద్ద మొత్తంలో మంటలు రావడంతో ఆ బాలుడి ముఖంతో పాటు ఇతర భాగాలు కూడా కాలిపోయాయి. బాలుడి కేకలు విన్న ఇంట్లో వారు బయటకి వచ్చి చూసే సరికి కాలిపోయిన శరీరంతో పడి ఉన్నాడు . వెంటనే కరీంనగర్ లోని ప్రభత్వ ఆసుపత్రికి తరలించగా వారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లవలసిందిగా కోరారు. దానితో వారు హైదరాబాద్ లో ఒక ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న తరుణంలో మరణించాడు… ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు రియాల్టీ షోలు చూడకుండా ఉండటమే ఉత్తమం, చూసినా వారు అలాంటి సాహాసాలు చేయకుండా పెద్దవారు ఎప్పుడు గమనిస్తూ ఉండాలి.

(Visited 726 times, 1 visits today)