Home / Entertainment / ఫస్ట్ లుక్ ఇదిగో అన్నాడు కాని.. సినిమా పేరును మాత్రం చెప్పట్లేదు.

ఫస్ట్ లుక్ ఇదిగో అన్నాడు కాని.. సినిమా పేరును మాత్రం చెప్పట్లేదు.

Author:

Sarainodu

ఇక మాస్‌, యాక్షన్‌, వినోదం ఇలా ఎలాంటి కథలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు అల్లు అర్జున్‌. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’తో కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. హీరోలోని వీరత్వాన్ని ఓ స్థాయిలో చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను కావటంతో వీళ్లిద్దరి కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రం ఎలా ఉండబోతోందనేది అందరిలో ఆసక్తి నెలకొంది. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. పవర్‌ఫుల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ భిన్నకోణాల్లో సాగుతుందని తెలిసింది. బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తొలిసారిగా రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.బన్నీ, బోయపాటి కాంబినేషన్ ఫ్యాన్స్ కి కిక్కివ్వబోతోంది… ఫస్ట్ టైమ్ వీరిద్దరి కలయికలో వస్తున్నఈ ప్రాజెక్ట్ పై భారీ అంచానాలు నెలకొన్నాయి…. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ టైమ్ జతకట్టింది… గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బన్నీ తన సినిమాల్లో స్త్టెల్‌కి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులోనూ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారట. యాక్షన్‌తో పాటు వినోదం, కుటుంబ బంధాలకూ ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.

సంక్రాంతి కానుకగా సరైనోడు మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్లు దర్శకుడు బోయపాటి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కాకపోతే మనోడు కేవలం ఫస్ట్ లుక్ విల్ బి అవుట్ అన్నాడు కాని.. సినిమా పేరును మాత్రం చెప్పట్లేదు.

(Visited 84 times, 1 visits today)