Home / Political / వచ్చే నెలలో పెట్రోల్ బంకులు బంద్ !

వచ్చే నెలలో పెట్రోల్ బంకులు బంద్ !

Author:

వాహన దారులకు ఒక చేదు వార్తా. పెట్రోల్ బంకుల యజమానులు వారి సమస్యలను పరిష్కరించాలంటూ వచ్చే నెలలో దేశవ్యాప్తంగా పెట్రోల్ నిలిపివేసి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆందోళనలు చేసేందుకు సిద్ధం అయ్యారు. 2012 లో యుపిఎ ప్రభత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా వచ్చే నెలలో 5 రోజులు పెట్రోల్ బంకులకు సెలవు ప్రకటించారు. నవంబర్ 3,15 న పూర్తిగా బంకులు మూతపడే అవకాశం ఉన్నట్టు తెలిపారు. వచ్చే నెల సెలవు దినాలలో బంకులు మూసివేయాలని సూచించారు. నవంబర్ 5 నుండి బ్యాంక్ సెలవులు కావడంతో ఈ నిరసనుకు మద్దతు ఎక్కువగా రానుంది. అలాగే ఈ నిరసనకు పూర్తీ మద్దతుగా అక్టోబర్ ( ఇదే నెలలో) 19,26 తేదీన రాత్రి 7 నుంచి 7:15 నిమిషాల వరకు పెట్రోల్ బంకుల్లో లైట్స్ ఆఫ్ చెయ్యనున్నారు. ఈ 15 నిమిషాల పాటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ విక్రయించకూడదని నిర్ణయించారు.

(Visited 4,702 times, 1 visits today)