Home / Entertainment / మళ్ళీ ఆడియో రిలీజ్ డేట్ మార్చుకున్న ‘బ్రహ్మోత్సవం’

మళ్ళీ ఆడియో రిలీజ్ డేట్ మార్చుకున్న ‘బ్రహ్మోత్సవం’

Author:

brahmotsavam samantha

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మహేష్ బాబు, స్రీకాంత్ అడ్డాల సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం “బ్రహ్మోత్సవం”. ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మొదలైనప్పటి నుండి రోజు రోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు విడుదల అయిన ఈ సినిమా మోషన్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు ఈ చిత్ర యూనిట్. ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా ఆడియో రోజుకో డేట్ మారుతూ వస్తుంది మొన్నటికి మొన్న ఈ సినిమా ఆడియోను మే 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పుడు అది కూడా మార్చివేశారు.

                     మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను మే 6వ తేదీ నుండి మే 7వ తేదీకి మార్చారు. పీవీపీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా యొక్క ఆడియో ఫంక్షన్ ను హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో పెద్ద ఎత్తున ఈ వేడుకను నిర్వహించనున్నారు.

(Visited 379 times, 1 visits today)