Home / Entertainment / ‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదల మరియు ఆడియో తేదీలు

‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదల మరియు ఆడియో తేదీలు

Author:

Mahesh-Babu-s-New-Brahmotsavam-poster

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమాలో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత నటిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం తర్వాత మహేష్ తో కలసి శ్రీకాంత్ అడ్డాల చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక్కడ ఈనెల 10వ తేది వరకు షూటింగ్ జరుపుకొని ఆ తరువాత రెండు సాంగ్స్ కోసం పూనే వెళ్లనున్నారు. అక్కడ రెండు సాంగ్స్ పూర్తి చేస్తే సినిమా దాదాపు పూర్తి అయినట్టే. ఈ పూనే  షెడ్యూల్ ఈ నెల 11 నుండి 20 వరకు ఉంటుంది. సినిమా ఆడియో ఫంక్షన్ ఏప్రిల్ 24న చాలా గ్రాండ్ గా తిరుపతిలో జరుపుతున్నట్టు ‘బ్రహ్మోత్సవం’ నిర్మాత అయిన పి.వి.పి సంస్థ వారు తెలియజేశారు.ఈ సినిమాకి సంగీతం మిక్కీ జె. మేయర్ అందిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాని మే 6న ప్రపంచవ్యాప్తంగా రీలీజ్ చేయనున్న విషయం ఇదివరకే తెలియజేశారు.

(Visited 806 times, 1 visits today)