Home / Entertainment / ‘బ్రహ్మోత్సవం’ కి కొద్దిగా రెస్ట్.

‘బ్రహ్మోత్సవం’ కి కొద్దిగా రెస్ట్.

Author:

Mahesh Babu Bramhostavam shooting

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మోత్సవం’. మహేష్ బాబు సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పివిపి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి కుటుంబ కథ చిత్రన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఊటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యిన అనంతరం మహేష్ కోత రెస్ట్ కోసం విదేశాలకు వేళ్ళి వచ్చాడు. తాజాగా సంక్రాంతి తర్వాత జనవరి 19 నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలై ఈ షెడ్యూల్ నిన్నటితో పూర్తయ్యింది.

ఈ వారం రోజుల షెడ్యూల్ తర్వాత మూడు రోజులు గ్యాప్ తీసుకొని మహేష్ బాబు తదుపరి షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్లో జనవరి 27 నుంచి న్యూ షెడ్యూల్ మొదలు కానుంది. ఇప్పటికే ఈ సినిమా 60% షూటింగ్ ని ఫినిష్ చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.

(Visited 78 times, 1 visits today)