Home / Entertainment / ‘బ్రహ్మోత్సవం’ టీజర్‌ చాలా అందంగా ఉంది

‘బ్రహ్మోత్సవం’ టీజర్‌ చాలా అందంగా ఉంది

Author:

brah

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, సమంత, కాజల్, ప్రణీత ఇలా ముగ్గురు హీరోయిన్లతో పాటు భారీ తారాగణం నటిస్తోన్న కాంబినేషన్‌లో ‘బ్రహ్మోత్సవం’ అనే ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి అందమైన సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడం వలన సెట్స్‌పైకి వెళ్ళినరోజునుంచే విపరీతమైన అంచనాలను మూటగట్టుకుంది.

ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు బ్రహ్మోత్సవం టీమ్ కొత్త సంవత్సర కానుకగా ఫస్ట్ టీజర్‌తో పలకరించింది. మహేష్ ఎప్పట్లానే తన చార్మింగ్ లుక్స్‌తో కట్టిపడేశారు. ఇక మిక్కీ జే మేయర్ అందించిన కూల్ ట్యూన్‌కు “వచ్చిందీ కదా అవకాశం.. ఓ మంచి మాట అనుకుందాం! ఎందుకు ఆలస్యం.. అందర్నీ రమ్మందాం” అంటూ వచ్చే పాటలో మహేష్‌తో పాటు సెట్టింగ్స్, ఇతర ప్రధాన తారాగణం.. ఇలా టీజర్ అంతా కళ కళగా కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ మెప్పిస్తోంది. ఇక ఈ టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయనే చెప్పొచ్చు.పీవీపీ సంస్థ ఎక్కడా రాజీ పడకుండా ఏ స్థాయిలో నిర్మిస్తోందో ఈ చిన్న టీజర్ చూస్తే తెలిసిపోతోంది. ఈ సినిమా ఏప్రిల్ నెలలో వేసవి సీజన్‌కు విడుదల కానుంది.

(Visited 155 times, 1 visits today)