Home / Entertainment / తిరుపతిలో ‘బ్రహ్మోత్సవం’ పాటలు?

తిరుపతిలో ‘బ్రహ్మోత్సవం’ పాటలు?

Author:

Mahesh Babu Next Movie Bramhostvam

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’ సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్. ఇటీవలే ఈ సినిమా ఊటి షెడ్యూల్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్ కి వచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకల కోసం అబ్రాడ్ వెళ్ళాడు. జనవరి ఫస్ట్ వీక్ లో మహేష్ తిరిగి రాగానే బ్రహ్మోత్సవం మరో కొత్త షెడ్యూల్ హైదరబాద్ లో మొదలవుతుంది.

ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం తెలిసింది. ప్రస్తుతం బ్రహ్మోత్సవం టీం మధ్య జరుగుతున్నా చర్చల ప్రకారం ఈ సినిమా ఆడియోని తిరుపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే కాకుండా, బ్రహ్మోత్సవం లాంటి సినిమా ఆడియోని తిరుపతి లో రిలీజ్ చేస్తేనే పర్ఫెక్ట్ అని ఈ చిత్ర టీం ఈ ఆలోచనలో ఉన్నారు.రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రలోనూ ఆడియో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రహ్మోత్సవం మొదటి రెండు రోజుల షూటింగ్ కూడా తిరుపతిలోనే జరిగింది.

(Visited 309 times, 1 visits today)