Home / Entertainment / ‘బ్రహ్మోత్సవం’ కి చిన్న విరామం.

‘బ్రహ్మోత్సవం’ కి చిన్న విరామం.

Author:

mahesh babu

శ్రీకాంత్ అడ్డాల “కొత్త బంగారు లోకం” అంటూ యూత్ అందరిని మరో లోకం లోకి కొత్తగా తీసుక్కెళ్ళాడు. తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి అందమైన కుటుంబ కథ సినిమా తర్వాత ముకుంద లాంటి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరి సినిమా తన నుండి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో ‘బ్రహ్మోత్సవం’ అనే మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే.పివిపి బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో షూట్ చేసారు. నిన్నతో ఊటీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం హైదరాబాద్ కి చేరుకున్నారు.

మహేష్ బాబు సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా గత రెండు వారాలుగా ఊటీలో ఓ షెడ్యూల్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ షెడ్యూల్లో మహేష్, కాజల్, ప్రణితలతో పాటు సత్య రాజ్, రేవతి తదితర భారీ తారాగణం కూడా పాల్గొంది. ఒక 10 రోజుల గ్యాప్ తర్వాత జనవరి ఫస్ట్ వీక్ నుంచి ఈ చిత్ర టీం మరో కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్రారంభించనున్నారు. మార్చి చివరికల్లా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

(Visited 70 times, 1 visits today)