Home / Inspiring Stories / వైఫై కావాలనే వాడికి వైఫెందుకు?

వైఫై కావాలనే వాడికి వైఫెందుకు?

Author:

India Boy Searching for Free Wi Fi then Bride cancels the Marriage

ఆన్ లైన్ లో వుంటూ పక్క మనుషులనే మర్చిపోతున్న రోజులివి.సెల్ ఫోన్ చేతిలో ఉండి దానికి నెట్ ఉంటే చాలు ప్రపంచాన్నే కాదు తమని తామే మర్చిపోయే మనుషులు ఈ మధ్య చాలానే పెరిగారు. ఇక ఇరవై నాలుగ్గంటలూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఉండే యువత మరీనూ. వీరిని ఆకర్షించటానికి కాఫీ డేల దగ్గర్నుంచీ క్యాబ్ సర్వీస్ ల వరకూ ఫ్రీ వైఫై అంటూ ఊదరగొట్టేస్తున్నాయి. ఇకనేం ఉంటూనే ఉండండీ అనుక్షణం అందుబాటులో అనుకుంటూ నెట్ పక్షులు వైఫై జోన్ లకోసం వెతుక్కుంటూ రోడ్డున తిరుగుతున్నారు….

ఇక విషయానికి వస్తే గుర్గావ్ లోని నిధి చౌదరికి ఒకబ్బాయితో నిశ్చితార్థం జరిగింది పెళ్ళికి ముందే ఒకర్నొకరు అర్థం చేస్కుందాం అంటూ కొన్ని సార్లు ఔటింగ్ కి వెళ్ళారు. ఐతే వెళ్ళినప్పుడల్లా ఆ అబ్బాయి ఫ్రీ వైఫై కోసం వెతికే వాడట ఇరవై నాలుగ్గంటలూ సెల్ఫీలు తీసుకుంటూనో మొబైల్ లో చాట్ చేసుకుంటూనో పక్క నే కాబోయే భార్య ఉందనే విషయం కూడా మర్చి పోయే వాడట. అందులోనూ ఫ్రీ వైఫై ఎక్కడా అంటూ అటూ ఇటూ తిరిగే అతని వాలకం నిధి కి చిరాకు పుట్టించింది.మారతాడని చాలా సార్లే చెప్పి చూసింది ఐనా అతని తీరు మారలేదు తాను పక్కన ఉండగానే గంటల తరబడి నెట్ లో మునిగి పోయే భర్త ఉన్న లేకున్నా ఒకటే అనిపించటం తో తనకీ పెళ్ళి వద్దంటూ తెగేసి చెప్పింది. పక్కనే ఉన్న మనిషి ని పట్టించుకోని మనిషి పక్కనే ఉన్నా ఎక్కడో ఉన్నా ఏం లాభం. అతను ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు మాత్రం మా అమ్మాయిని ఏం చూసుకుంటున్నాడు అంటూ నిధి చౌదరి నిర్ణయాన్ని సమర్థించి ఆ సంబందం వదులుకున్నారట ఆ అమ్మాయి కుటుంబసభ్యులు కూడా. సో అర్థమైంది కదా పక్కనే ఉన్న మనుషులని కూడా పట్టించుకోండి ఫ్రీగా వచ్చింది కదా అని వైఫై వాడేస్తే తర్వాత ఫోన్లతో ఆన్ లైన్ కాపూరాలు చేస్కోవటమే మరి…

(Visited 136 times, 1 visits today)