Home / health / షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా…? అయితే వంకాయ తినండి.

షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా…? అయితే వంకాయ తినండి.

Author:

‘‘వంకాయ వంటి కూరయు… పంకజముఖి సీత వంటి భామా మణియున్, శంకరుని వంటి దైవము… లంకాధిపు వైరి వంటి రాజున్ కలడే’’. వంకాయ వంటి కూర, పద్మం వంటి ముఖం కలిగిన సీత వంటి స్త్రీ, శివుడి లాంటి దేవుడు, లంకాధిపతి రావణుడికి శత్రువైన రాముడి వంటి రాజు లేరన్నది ఈ పద్యం యొక్క అర్థం. వంకాయ కూర తింటే ‘ఆహా! ఏమి రుచి’ అనాల్సిందే. కాయగూరల్లో వంకాయ రాజు. వంకాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. వయస్సు ఛాయలు కనిపించనీయవు. శరీరంలో వాపు, నరాల బలహీనత తగ్గించే శక్తి వంకాయలకు ఉందని డైటీషియన్లు చెబుతున్నారు.

brinjal-health-benefits-for-diabetic-patients

ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు దీన్ని ఎంత ఎక్కువ తీసుకుంటే అంతమంచిదట. దీనిలో తక్కువ మోతాదులో గ్లిజమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీని కారణంగా దీన్ని ఎంత ఎక్కువ తీసుకున్నా ఆరోగ్యానికి హాని చేయదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది ఎంతో ప్రతిభావంతమైన యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియా లక్షణాలను కలిగి వుంటుంది. శరీరంలో హాని కలిగించే బాక్టీరియాలను అంతం చేయడంలో వంకాయ ఎంతోగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

(Visited 2,852 times, 1 visits today)