Home / Political / తెలుగు ప్రజలు గర్వపడేలా చేసిన బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రకటన

తెలుగు ప్రజలు గర్వపడేలా చేసిన బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రకటన

Author:

British Airways Fuelled by Love

 తెలుగుదనం ఉట్టిపడేలా తీసిన ఈ ప్రకటన చూస్తే మళ్లీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ ప్రకటన చేసింది మన తెలుగు వారు కాదు సరి కదా.., మన భారతదేశం వారు కాదు. ఈ ప్రకటన చిత్రీకరించింది బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థ వారు. ఈ అద్భుతమైన ప్రకటనను భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ ల విమాన మార్గాల ప్రచారం కోసం తీయబడింది.

             ఇది యాదార్ధ సంఘటన ఆధారంగా తీసిన వీడియో అని వారు తెలిపారు. ఈ ప్రకటన భారతీయ వృద్ధ మహిళ మరియు 23 సంవత్సరాల వయసు గల హెలీనా అనే ఎయిర్ హోస్టెస్ ల మధ్య జరిగిన తీపి జ్ఞాపకాల ఆధారంగా తీయబడింది. బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రయాణంలో భాగంగా ఇరువురికి మద్య జరిగిన కొన్ని మధురమైన సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటలన వల్ల తన మనసుకి నచ్చిన హెలీనా ను తమ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది వృద్ధ మహిళ.

           తన ఆహ్వానం మేరకు హెలీనా వారి ఇంటికి వెళుతుంది. హెలీనాని వారి కుటుంబం రిసీవ్ చేసుకునే విధానం మరియు తనకోసం చేసే వంటకాలు మన అందరిని అబ్బురపరుస్తాయి. మీరు కూడా ఈ వీడియో చూసి ఆనందించగలరు.

(Visited 9,505 times, 1 visits today)