Home / Political / నిన్ను చెల్లి అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నా…

నిన్ను చెల్లి అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నా…

Author:

madhupriya-brother fires

మధు ప్రియ… ఆడపిల్ల నమ్మా నేను ఆడపిల్లనానీ అంటూ చిన్న వయసు నుంచే తెలుగు  ప్రజలకు దగ్గరై ఒక చిన్న స్థాయి సెలబ్రిటీగా మారిన అమ్మాయి. తన పెళ్ళి విషయంలో రాష్ట్రమంతా ఆసక్తిగా మారింది. మధుప్రియని తమ సొంత చెల్లెలుగా భావించిన వాళ్ళంతా తనకి మద్దతుగానూ ఒకింత కోపంగానూ స్పందించారు. తమ సొంతింటి అమ్మాయిగా భావించటం వల్లే అంత కోపంగా స్పందించామని చెప్పారు. ఆ తర్వాత ఆమె సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారు కూడా… అయితే అరు నెలలు తిరక్కుండానే మళ్ళీ మీడియా ముందుకొచ్చింది మధుప్రియ. తన భర్త తనను వేదిస్తున్నాడంటూ తీవ్రస్థాయిలో అతన్ని తిట్టిన మధుప్రియ ఇంకా, చిన్న పిల్ల లాగానే రెండురోజుల్లోనే మళ్ళీ ఒక సారి తల్లితండ్రులని సమాజం ముందు అవమానించింది, తన తల్లి తండ్రులు చెప్పటం వల్లే తానలా చేయాల్సి వచ్చిందంటూ మాటమార్చి తన మెచ్యూరిటీని తానే బయట పెట్టుకుంది…

        ప్రేమ పెళ్ళీ తన సొంత విశయమైన కాపురంలో కలతలని పతాక శీర్షికలు గా చూపించిన సామాజిక,వార్తా మాధ్యమాలూ తమ వ్యాపార ధోరణిని మరోసారి నిరూపించుకున్నాయి అయితే ఈ వ్యవహారం అంతా చూసి చిర్రెత్తుకొచ్చిన వాళ్ళ సంగతి పక్కన పెడితే… మధుప్రియ చేసిన పనిని తప్పుపడుతూ ఆమెని చెల్లెలిగా భావించిన అభిమాని ఒకరు ఘాటుగానే స్పందించాడు. నిన్ను చెల్లి అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నా.. ఓ అన్నయ్యగా చెబుతున్నా అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఒక సెలబ్రిటీ అయిన నా పరిస్థితే ఇలా ఉంటే అన్నావు కదా..! అసలు నువ్వు ఎందులో స్టార్ ? ఆడపిల్లనమ్మా అనే పాట పాడే అర్హతే నీకు లేదంటూ మండిపడ్డాడు. బడ్జెట్ సమావేశాలున్నప్పుడు వాటిని కూడా పక్కకు పెట్టి….. మధుప్రియ తిట్ల పురాణనాన్ని నా కొడుకులు అన్న మాటలని ప్రముఖ వార్తలా వేసిన వార్తా మాధ్యమాలకి కూడా ఒక దెబ్బవేసాడు.

              “ఇప్పుడైనా బుద్ది తెచ్చుకొని మొగుడితో కాపురం చెయ్..నిన్ను కనటం తప్ప మీ నాన్న చేసిన తప్పేంలేదు. నేను స్టార్ ను అని నువ్వే చెప్పుకోకు” అంటూ మధుప్రియ మీద తన కోపాన్ని మొత్తం ఓ వీడియోలో పోస్ట్ చేశాడు ఈ కుర్రాడు. గతంలో మధుప్రియ పెళ్లి తర్వాత కూడా ఓ వ్యక్తి మధుప్రియపై ఇలాగే వీడియో లో ఫైర్ అయ్యాడు. అయినా వాళ్ళ సొంత విషయాలని వాళ్ళకు వదిలేయకుయండా వార్తల్లాగా వేయటం మీడియాకీ, ఇలా వీడియోల్లో తిట్టి మరీ పోస్ట్ చేయటానికి ఈ అభిమానులకీ పని లేదా అంటున్నారు సోషల్ మీడియా లో జనాలు…

(Visited 7,577 times, 1 visits today)