Home / Reviews / బ్రూస్ లీ సినిమా రివ్యూ.

బ్రూస్ లీ సినిమా రివ్యూ.

Bruce lee movie review and rating, bruce lee the fighter cinema review and rating and first day collections

Alajadi Rating

2.75/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: రామ్ చరణ్,రకుల్ ప్రీత్ సింగ్,కృతి కర్బంధ, రావు రమేష్, చిరంజీవి

Directed by: శ్రీను వైట్ల

Produced by: DVV దానయ్య

Banner: DVV Entertainments.

Music Composed by: S.S. థమన్

మెగా తనయుడు రాం చరణ్ సినిమాలో చిరు కనిపించ బోతున్నాడు అనగానే అందరి చూపూ బ్రూస్లీ వైపే మళ్ళింది.అసలే ఆగడు ఫ్లాప్ తో దెబ్బతిన్న పులిలా ఉన్నశ్రీను వైట్ల ఒక హైటెన్షన్ క్యారెక్టర్ని డిజైన్ చేసి వదులుతున్నా అనేంత కసిగా తీసిన సినిమా. సాధారణంగానే కోనా వెంకట్ కూడా టీం లో ఉన్నాడు అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి.ఒక హిట్ కోసం సినిమా యూనిట్,తమ అభిమాన నటుని పెర్ఫార్మెన్స్, చిరు రీఎంట్రీ సీన్ కోసం అభిమానులూ ఉత్కంటగా ఎదురు చూసారు. అనుకున్నట్టే సినిమా విడుదలైంది.. ప్రేక్షకుడు సంతృప్తి చెందినట్టే అనే టాక్ వచ్చింది… మరి చెర్రీ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా …!? అనేది ఇవాల తేలిపోనుంది..

కథ:

అందరి తండ్రుల్లాగే తన కొడుకునీ కలెక్టర్ గా చూడాలనుకూంటాడు రామచంద్ర రావు(రావు రమేష్). అందు కోసం కూతురు కావ్యని(కృతి ఖర్బందా) మాత్రం ఎంక‌రేజ్ చేయ‌డు. కానీ కావ్యకి మాత్రం చదువంటే ఇష్టం బాగా చదువు కోవాలనుకుంటూంటుంది. అక్క మీద చాలా ఇష్టం ఉన్న కార్తీక్(రాం చరణ్) అక్క కోసం త‌న చ‌దువును ఆట‌కెక్కించి స్టంట్ మాస్ట‌ర్ గా మారుతాడు కార్తీక్ అలియాస్ బ్రూస్ లీ అన్న మాట. ఇలా డేంజ‌ర్ డేవిడ్‌(జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్‌) ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా వ‌ర్క్ చేస్తుంటాడు. ఓ సంద‌ర్భంలో పోలీస్ గెట‌ప్‌లో వెళ్ళి విల‌న్స్ నుండి ఓ అమ్మాయిని కాపాడుతుంటే బ్రూస్‌లీని చూసిన రియా(ర‌కుల్ ప్రీత్ సింగ్‌) బ్రూస్‌ లీని పోలీస్ ఆఫీస‌ర్‌ అనుకొని అతని ప్రేమలో పడిపోతుంది.చిన్నప్పటి నుంచీ తనకి పోలీస్ అంటే ఉన్న విపరీతమైన ఇష్టంతో బ్రూస్లీ ని డైనమిక్ ఆఫీసర్గా  అనుకొని ప్రేమిస్తున్న రియకి బ్రూస్ లీ కూడా త‌ను పోలీస్ ఆఫీస‌ర్ కాద‌నే నిజాన్ని చెప్ప‌డానికి ప్ర‌య‌త్నం చేస్తుంటాడు.

ఐతే అనుకోని సందర్బాల్లో కొన్ని సమస్యల్లో చిక్కుకున్న రియా ని కాపాడటానికి అక్క‌డ విల‌న్స్‌ను చిత‌ కొట్టి రియాను కార్తీక్ కాపాడుతాడు.దాంతో విలన్ గ్యాంగ్ తో కార్తీక్ కి వైరం ఏర్పడుతుంది. దాంతో విలన్ దీప‌క్ రాజ్‌(అరుణ్ విజ‌య్‌) బ్రూస్‌లీని క‌నిపెట్టి చంపాల‌నుకుంటుంటాడు.ఇది ఒక వైపున జరుగుతూ ఉంటే.. రామచంద్ర రావు పని చేసే వసుంధర లాబ్స్ కంపెనీ అధినేతలైన జయ రాజ్(సంపత్ రాజ్)-వసుంధర (నదియా) లు కృతిని తన ఇంటి కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఐతే  కార్తీక్ మీద కోపం తో ఉన్న దీప‌క్ రాజ్ బ్రూస్ లీ అక్క అయిన కావ్యని డ్రగ్స్ కేసులో ఆరెస్ట్ చేయిస్తాడు. ఆ దొంగ‌ కేసు నుండి అక్క‌ను బ‌య‌ట‌ప‌డేయ‌డానికి దీపక్‌ రాజ్‌తో బ్రూస్‌లీ గొడ‌వ‌ప‌డ‌తాడు. ఆ గొడ‌వ‌లో దీప‌క్ రాజ్ కోమాలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అస‌లు విల‌న్ ట్రాక్ లోకి వ‌స్తాడు. అలాగే అప్పటి వరకూ మంచి అనే ముసుగులో ఉన్న జయరాజ్ గురించి కూడా కొన్ని జీర్ణించుకోలేని నిజాలు బయటకి తెలుస్తాయి. వీటి వల్ల తన ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది అని తెలుసుకున్న బ్రూస్ లీ ఏం చేసాడు.? అస‌లు దీప‌క్‌రాజ్ ఎవ‌రు? అత‌నికి వ‌సుంద‌ర లాబోరేట‌రీస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అక్క కోసం కార్తీక్ ఎలాంటి రిస్క్  తీసుకుంటాడు? త‌న తండ్రిని, ఫ్యామిలీని విల‌న్స్ ద‌గ్గ‌ర నుండి ఎలా కాపాడుకుంటాడు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

అలజడి విశ్లేషణ:

ఫైట్ మాస్టర్ కథ అనగానే కొత్త ఫార్ములా కథ అనుకున్నారు కానీ శ్రీను వైట్ల తన పాత ఫార్ములానే మళ్ళీ వాడాడు ర‌చ‌యితలు కోన‌ వెంక‌ట్‌, గోపి మోహ‌న్ ల‌తో శ్రీనువైట్ల సినిమా ఎలా ఉంటుందని అనుకుంటామొ ఖచ్చితంగా అలానే ఉంటుంది కాకుంటే ఎప్పటి లాగే కామెడీ,నటుల పెర్ఫార్మెన్స్ మీద కథను నిలబెట్టాడు. ఈ సినిమాకి ముఖ్యమైన ఎస్సెట్స్ అంటే మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ అందించిన థ‌మ‌న్, ఇంకా కెమెరా వ‌ర్క్ చేసిన మ‌నోజ్ ప‌ర‌మ‌హంస‌.నిజానికి మనోజ్ చేసిన వర్క్ అద్బుతంగా ఉంది.ఇదంతా ఒక ఎత్త‌యితే చిరంజీవిని తీసుకు రావటం దాదాపుగా 6ఏళ్ళ తర్వాత మంచి ఎనెర్జీ తో చిరంజీవి ఎంట్రీని డైరెక్ట‌ర్ డిజైన్ చేయ‌డం సూప‌ర్‌. సినిమాలో లాజిక్స్ మిస్స‌యినా కామెడితో కూడిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ను చేయ‌డం చాలా వ‌ర‌కు ప్ల‌స్ అయ్యింది.ప్రేక్షకుడు ఈ సెంటిమెంట్ తో చక్కగా కనెక్ట్ ఔతాడు.సినిమా అన్నాక కొన్ని కొన్ని మైనస్ లు ఉంటాయి, ఆ మైనస్ ని కవర్ చేసే కొన్ని అంశాలు సినిమాలో వర్కౌట్ అవ్వడం వలన మెగా ఫాన్స్ సినిమాకి కనెక్ట్ అవుతారు..

ఒక‌ సారి మొద‌లెట్టిన త‌ర్వాత రియాక్ష‌న్స్ క‌న‌ప‌డ‌వ్‌, రిసౌండ్స్ మాత్ర‌మే విన‌ప‌డ‌తాయి“, “లక్ష్యం కోసం అంద‌రూ ప‌రిగెడ‌తారు కానీ కొంద‌రు మాత్ర‌మే ఎదుటివాళ్ళ ల‌క్ష్యం కోసం నిల‌బ‌డ‌తారు“.., “వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తా“, చివ‌ర్లో చిరంజీవి ర‌కుల్ తో ఎలాగెలాగ‌..అంటూ డైలాగ్ చెప్పటం సూపర్ అనిపిస్తుంది. డైలాగ్స్ కి ఆడియెన్స్ నుండి మంచి అప్రిసియేష‌న్ వ‌చ్చింది.చరణ్ నటన,బాడీ లాంగ్వేజ్ లని చక్కగా డిజైన్ చేసారు. మొత్తానికి సినిమా చూసాక తను టికట్టు కోసం పెట్టిన ఒక్క పైసా కూడా వృధా కాదు అనే ఫీలింగ్ తోనే బయటకు వస్తాడు పేక్షకుడు..

 నటీనటుల ప్రతిభ:

 రాం చరణ్: చరణ్ నటనలో మారుపుని ఇట్టే పసిగట్తవచ్చు చక్కని పరిపక్వత కనబడుతుంది. ఒక ఫైటర్ కి ఉండవలసినబాడేఎ లాంగ్వేజ్ ని చూపటం లోనూ,యాక్షన్ సన్ని వేశాల్లోనూ చెర్రీ చూపించిన పెర్ఫార్మెన్స్ అద్బుతం అనిపించక మానదు.డైలాగ్ డెలివరీ లోనూ పంచ్ లు అదిరాయి. సినిమా పల్స్ పాయింట్లలో రాం నతన కూడా ఒక టి అని చెప్పొచ్చు..

రకుల్ ప్రీత్ సింగ్: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్లోనే బెస్ట్ స్క్రీన్ ప్రెజన్స్ బ్రూస్ లీ లోనే అని చెప్పాలి. ఇప్పటి వరకూ కనిపించిన దాని కంటే చాలా క్యూట్ గా, చాలా అందంగా, మోస్ట్ గ్లామరస్ గా కనిపిస్తుంది. సింప్లీ యూత్ అయితే వావ్ వాట్ ఏ బ్యూటీ అంటూ తన మాయలో పడిపోతారు. రామ్ చరణ్ – రకుల్ ప్రీత్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరింది.

కృతి కర్భంద నటన పాత్రకు సరిపోయేలా ఉంది. సంపత్ మరియు రావు రమేష్ వారి పాత్రలకు అనుభవాన్ని జోడించి ప్రాణం పోశారు. నదియ పాత్ర మరియు పవిత్ర లోకేష్ పాత్రలు ఆకట్టుకున్నాయి. తనికెళ్ళ భరణి , పృథ్వీ రాజ్ లు ఇద్దరూ ఏదో ఉన్నరు అనుకోవటం తప్ప పెద్దగా చేసిందేమీ లేదు. ఎప్పటి లాగే బ్రహ్మానందం పాత్ర చిత్రంలో బాగా ఉపయోగపడింది కాని రోటీఈన్ ఎక్స్ప్రెషన్ ల కామెడీ పెద్దగా నవ్వించ లేదు. జయప్రకాశ్ రెడ్డి మరియు ఇతర నటీనటులు, చక్కగా నవ్విస్తారు..

 

సాంకేతిక వర్గం పనితీరు:

నిజానికి బ్రూస్లీ కథ కొత్తదేం కాదు చాలా సార్లు ఇంకా చెప్పాలంటే శ్రీను వైట్ల ఇదివరకు చెప్పిన కథే..స్క్రీన్ ప్లే కూడా నెక్స్ట్ సీన్ ఏముంటుందో ఊహించేటంత మామూలుదే ఐతే ఎక్కడా బోర్ కొట్టనివ్వని కథనం కొంత హెల్ప్ అయింది. ఫస్టాఫ్ ని ఎంటర్టై మెంట్ తో నడిపించేసారు సెకండాఫ్ లో తడ బడ్డారు. మాటల్లో కూడా పంచ్ డైలాగ్ అంటే ప్రాస మీద ద్యాస పెట్టినట్టు ఉన్నాయి,దర్శకుడి గా శ్రీను వైట్ల లో మైనస్ లు ఏమీ లేవు, ఐతే ప్లస్ పాయింట్లు కూడా ఏం లేవు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస పని తనం అద్భుతం అయన ఒక్కో ఫ్రేం ని చూపించిన విధానం సినిమాకి వెన్నెముకగా మారింది .. ముఖ్యంగా విదేశాల్లో చిత్రీకరించిన పాటల్లో సినిమాటోగ్రఫీ వీనులవిందు.రాం లక్ష్మణ్ ల కపోజిషన్ లో ఫైట్స్ పీక్స్ లో కనిపిస్తాయి. సంగీతం అందించిన తమన్ చరణ్ కోసమే ఇచ్చినట్టుగా ఉన్న త్యూన్స్, కీలక సన్నివేశాలను తమన్ నేపధ్య సంగీతం చక్కగా కుదిరాయి. అనవసరం అయిన సన్నివేశాలు చాలానే కనిపిస్తాయి ఇవన్ని ఎడిటింగ్ లో ఇంకాస్త శ్రద్ద తీసుకోవాల్సింది. యూనివర్సల్ మీడియా వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

  • మొదటి ప్లస్ ఖచ్చితంగా చిరంజీవి
  • థమన్ అందించిన నేపధ్య సంగీతం
  • సినిమాటోగ్రఫీ
  • చరణ్ డాన్సు,నటన
  • రకుల్ ప్రీత్ అందాలు.

మైనస్ పాయింట్స్ :

  • సాగ దీసినట్టుండే సెకండ్ హాఫ్
  • ఏ మాత్రం కొత్త దనం లేని శ్రీను వైట్ల మార్కు కథ
  • సో సో గా అనిపించే కామెడీ
  • ముఖ్యంగా ఎడిటింగ్

పంచ్ లైన్: ఫ్యామిలీ కోసం పోరాడిన బ్రూస్లీ ద ఫైటర్.

(Visited 139 times, 1 visits today)