Home / Entertainment / బ్రూస్ లీ పాటలు విడుదల చేసిన మెగాస్టార్.

బ్రూస్ లీ పాటలు విడుదల చేసిన మెగాస్టార్.

Author:

“బ్రూస్లీ ద ఫైటర్” పాటలతో వచ్చేసాడు…రామ్ చరణ్ బ్రూస్ లీ ఆడియో వేడుకలకి హైటెక్స్ వేదికయ్యింది మెగా అభిమానుల కేరింతలతో ఆ ప్రదేశమంతా హోరెత్తిపోయింది.. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైనా బ్రూస్లీ పాటలకి వేసిన స్టెప్పులకి స్టేజ్ కలర్ ఫుల్ గా వింత జోష్ తో వెలిగిపోయింది.

శ్రీను వైట్ల దర్శకత్వం లో మెగా తనయుడు రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ ఆడియో రిలీజ్ నిన్న సాయంత్రం హైటెక్స్ లో వైభవంగా జరిగింది. ఇదే సినిమాలో అతిథి పాత్రలో నటించిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదు గానే పాటలు విడుదలయ్యాయి.తొలి మ్యూజిక్ సీడీ ని అల్లు అరవింద్,వీ.వీ.వినాయక్ లకు అందజేసారు. తరువాత పోస్టర్ ని వీ.వీ.వినాయక్ ఆవిష్కరించగా ఈ సినిమాకి అంబందించిన మొబైల్ ఆప్ ని మెగాస్టార్ సతీమణి సురేఖ, రామ్ చరణ్ లు విడుదల చేసారు. అభిమానుల కేరింతల మధ్య మైక్ అందుకున్న చిరు మాట్లాడుతూ…” దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత కెమెరా ముందుకు వచ్చాను ఎలా చేస్తానో ఏమో అన్న ఉత్కంఠ నాకూ కలిగింది కానీ షాట్ ఐపోయాక రష్ చూసుకున్నా పర్వాలేదు పనికొస్తాం అనిపించింది”  అన్నారు.  ముందు తాను ఈ సినిమాలో చేయటానికి ఒప్పుకోలేదనీ కానీ శ్రీనూ వైట్ల, కోనావెంకట్ ల బలవంతం మీదే చేయాల్సి వచ్చిందనీ అన్నారు. 150 వ సినిమాకి టీజర్ లా ఉంటుంది మీరు చేయాల్సిందే అంటూ తనని ఒప్పించినందుకూ తన అభిమానులకు గిఫ్ట్ గా ఉంటుందనీ అనటమే కాదు ఈ సినిమాలో ఆయన చెప్పే ఒక డైలాగ్ ని కూడా చెప్పిన చిరు అబిమానులని ఇంకా ఆనందింపజేసారు.. అభిమానుల కోసమే శ్రీను వైట్ల ఆ డైలాగ్ ని పెట్టించాడట. “బాస్ మీ స్టామినాని మ్యాచ్ చేయటం మీ స్పీడ్ ని క్యాచ్ చేయటం  ఎవరి వల్లా కాదు” అనేది రామ్ చరణ్ డైలాగ్ ఐతే “నా స్టామినా కీ నా స్పీడుకీ ఫ్యుయెల్ నా అభిమానులే,మన అభిమానులు మన కోసం ఎదురు చూస్తున్నారు నేను వెళ్ళాలి బై” అనేది చిరు డైలాగ్. తాను చదువుకొనే రోజుల్లో తనూ బ్రూస్లీ ఫ్యాన్ ని అనీ చెప్పిన చిరు ఈ సినిమా కొసం రామ్ చరణ్ పడ్డ కష్టాన్ని చెప్పుకొచ్చారు. ఓక రోజు రామ్ చరణ్ చాలా అలసి పోయి అర్థ రాత్రి ఇంటికి వస్తే “ఇంత కష్టం అవసరమా?” అన్నరట సురేఖ. దానికి రామ్ చరణ్ “డాడీ కష్టాన్ని చూసిన నువ్వే ఇలా అంటున్నావేంటమ్మా” అని సమాధానం చెప్పారట. ఈ విషయాని అభిమానులతో పంచుకున్న చిరు బ్రూస్లీ ఒక విందుభోజనం లా ఉంటుందనీ,టీం అందరూ ఎంతో కష్టపడి సినిమాని మంచి విలువలతో తెరకెక్కించారనీ చెప్పారు.

తరవాత మాట్లాడిన వీ వీ వినాయక్ “సెట్ లో అన్నయ్య ఎలా ఉంటారో చూడాలనిపించి వెళ్ళాను ఇంకా అలాగే కత్తిలా కనిపించారు” అనటం తో ప్రేక్షకుల గ్యాలరీ లోంచి చప్పట్లు హోరెతాయి. ఇంకా “శ్రీను వైట్ల నాకు ఇష్టమైన దర్శకుడు శ్రీనూ, కోనా ల కాంబినేషన్ ఎప్పుడూ ఫెయిలవ్వలేదు బ్రూస్లీ కూదా సూపర్ హిట్ ఔతుంది” అన్నారు.

తరువాత ఈ సినిమా దర్శకుడు శ్రీను వైట్లా మాట్లాడుతూ “ముదుగా కథని ఓకే చేసీ రామ్ చరణ్ ని కూడా ఒప్పించిన చిరంజీవి గారికి ధన్యవాదాలు చెప్తూ చిరు కూడా స్వయంగా పాల్గొనటం తనకు ఎంతో ఆనందంగా ఉందనీ.. చరణ్ నటన ఇరగ దీసారనీ చిరు లోని కామెడీ టైమింగ్ ని రామ్ చరణ్ లో మళ్ళీ చూస్తామనీ అన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ “నాన్నతో చేసేటప్పుడు మొదటి షాట్ లోనే గుండెలో వంద గుర్రాలు పరిగెత్తినట్టు అనిపించిందని అన్నారు,అక్కా తమ్ముళ్ళ కథ ఇదనీ, తమన్ పాటలు ఈ సినిమాకి ప్లస్ ఔతాయనీ అన్నారు. సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ “ఇంత పెద్ద సినిమాలో నటించటం తన అదృష్టమనీ అన్నారు.  గీతా ఆర్ట్స్ మగ ధీరుడు చరణ్ కి పోటీ అంటూ ఉంటే అది చిరంజీవి గారే అనీ తండ్రీ కొడుకులు గుర్రం మీద వస్తూంటే చూడటానికి రెండు కళ్ళూ సరిపోవనీ అన్నారు..

ఈ కార్యక్రమం లో తమన్, కోనా వెంకట్,గోపీ మోహన్ రామ జోగయ్య శాస్త్రి ఇంకా ఉపాసన, శ్రీజ, సురేఖ, నదియ, కృతి కర్బందా తదితరులు పాల్గొన్నారు…

(Visited 166 times, 1 visits today)