Home / Videos / మూడు రోజుల్లో బ్రూస్ లీ వచ్చేస్తున్నాడు..కాచుకోండి ఆడియన్స్…..

మూడు రోజుల్లో బ్రూస్ లీ వచ్చేస్తున్నాడు..కాచుకోండి ఆడియన్స్…..


బ్రూస్ లీ..ద ఫైటర్..ఇంకో మూడు రోజుల్లో వస్తున్నాడంటూ డి.వి.వి. ఎంటర్ టెయిన్ మెంట్స్ ఒక యు ట్యూబ్ వీడియో ని పోస్ట్ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్, శ్రీను వైట్ల చాలా ఎక్సైటింగ్ గా ..బ్రూస్ లీ ఇంకో మూడు రోజుల్లో వచ్చేస్తున్నాడంటూ ప్రేక్షకులను ఊరించేశారు. రామ్ చరణ్  ‘బ్రూస్ లీ’ మూవీలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కీలకపాత్ర తాలూకు ఫస్ట్ లుక్ పేరుతో నెట్ లో చక్కర్లు కొడుతున్న ఇమేజ్ నిజంగా బ్రూస్ లీ సినిమా లోని దేనా?, లేక, పాత ఇమేజ్ ని గ్రాఫిక్ చేశారా?, బ్రూస్ లీలో చిరంజీవి పాత్ర ఏంటి.? ఎలా ఉండబోతోంది.? అని అడిగితే మాత్రం అంతా సస్పెన్స్ అంటున్నారు డైరెక్టర్ శ్రీనువైట్ల. ఇదో సర్ ప్రైజ్ ప్యాకేజ్ అని, అదేంటో సినిమాలోనే చూడాలని శ్రీను చెబుతున్నారు. మొట్టమొదట స్టోరీ చెప్పినప్పుడే చిరంజీవి ఆ పాత్ర చేసేందుకు అంగీకరించారని,అయితే, ఇది ఆయనకోసం కల్పించిన పాత్రకాదన్నారు.  స్టోరీ డిమాండ్ చేయడంతోనే చిరుతో ఇలాంటి కీలకరోల్ చేయించాల్సి వచ్చిందని చెప్పారు.

చిరంజీవి పాత్ర చాలా సహజంగా ఉంటుందన్నారు. ఈసినిమా అనుకున్న టైంకి ప్రేక్షకులముందుకు తెచ్చేందుకు రాత్రింబవళ్లు పని చేస్తున్నామని, కొన్ని సాంగ్స్ మినహా ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని డైరెక్టర్ శ్రీను వైట్ల తెలిపారు. చరణ్ స్టన్నింగ్ లుక్స్ తో ఇరగదీస్తాడని, బ్రహ్మానందం పాత్రకూడా అద్భుతంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. బ్రూస్‌లీ కి బిగ్ ఫ్యాన్ గా.. స్టంట్ మ్యాన్ గా రామ్ చరణ్ ఈ మూవీలో నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 16న ‘బ్రూస్ లీ’ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. చాన్నాళ్ల తర్వాత ‘బ్రూస్ లీ’ మూవీతో చిరంజీవి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నాడు. చేసేది గెస్ట్ రోల్ అయినా, ఫ్యాన్స్ అంచనాలకు అందని విధంగా ఆయన రోల్‌ని డైరెక్టర్ డిజైన్ చేశాడు. దీంతో ఆయన లుక్ ఎలా వుండబోతుందనే దానిపై మెగా ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.

దీనికితోడు చిరంజీవి సెట్స్ పైకి రావడంతో ఆయనకు సంబంధించి ఏ స్టిల్ కూడా బయటకు లీక్ కావడానికి వీల్లేదంటూ శ్రీనువైట్లయూనిట్ సభ్యులకు గట్టిగానే చెప్పాడట. ఐనా ఓ స్టిల్ మాత్రం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. సెట్స్‌లో చిరంజీవి బ్లాక్ స్పెట్స్, బ్లాక్ షర్ట్‌తో కాస్త చూడటానికి యంగ్ హీరోలా కనిపిస్తున్నాడని అంటున్నారు. సో.. ట్రెండ్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా డిఫరెంట్ లుక్‌లో చిరంజీవి కనిపించబోతున్నాడు.

(Visited 40 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]