Home / Political / బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల సంగతి దేవుడెరుగు, ముందు సైనికులకు సరైన తిండి పెట్టండి.

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల సంగతి దేవుడెరుగు, ముందు సైనికులకు సరైన తిండి పెట్టండి.

Author:

దేశానికి సైనికులు చేస్తున్న సేవ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా 24 గంటలు మన దేశాన్ని శత్రువుల భారి నుండి కాపాడుతారు. వాతావరణం సహకరించకపోయినా వారు తమ డ్యూటిని నిబద్దతతో చేస్తారు. అలాంటి వారికి సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం వారికి ఎటువంటి భోజనం పెడుతుందో తెలిస్తే మనమందరం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్తితి. తల పొగరుతో మందు, ఆహారం కోసమే చాలా మంది ఆర్మీలో చేరుతున్నరని వాగిన కుక్కలకు ఒకసారి ఈ వీడియో చూపండి అంటూ జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతంలో మన జవాన్లు పడుతున్న కష్టాలను భద్రతా దళంలోని 29వ బెటాలియన్‌కి చెందిన తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ అనే సైనికుడు వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

bsf-jawan-food

వాతావరణం సహకరించక పోయినా, సదుపాయాలు సరిగ్గ లేకపోయినా రోజుకు ఖచ్చితంగా 10 గంటలు విధులు నిర్వర్తిస్తున్నామని కాని సైనికులకు పెట్టె ఆహారం ఏమాత్రం బాగోలేదని ఆ వీడియోలో తెలిపాడు. అంతే కాకుండా సైనికులకు అందజేస్తున్న మాడిపోయిన రొట్టెలను, నీళ్ళ టీ ని కూడా మరో వీడియోలో చూపించాడు. కొన్ని సార్లు రాత్రికి పసుపు, ఉప్పుకలిపిన సూప్‌ తాగి ఖాళీ కడుపుతో విధులు నిర్వర్తిస్తున్నామని తమ దైన్యపరిస్థితిని వెల్లడించాడు తేజ్‌ బహదూర్‌ యాదవ్‌. ప్రభుత్వం సైన్యానికి వెచ్చిస్తున్న నిధులు సైనికులకు చేరడం లేదని, ఉన్నతాధికారులే తినేసి జవాన్లకు కల్పించాల్సిన సౌకర్యాలను కల్పించడంలేదని వాపోయాడు. ఇకనైనా పై అధికారులు మేల్కొని పరిస్తితి చక్కదిద్దాలని కోరుకున్నాడు. ఇది బోర్డర్ లో మన సైనికుల పరిస్తితి ప్రభుత్వం దీనిపై స్పందించి త్వరగా సైనికులకు సరైన సదుపాయాలు కల్పించాలని కోరుకుందాం.

(Visited 919 times, 1 visits today)