Home / Inspiring Stories / ఇంకెంత కాలం ఈ దేశ సైనికులు ఏడుస్తూనే ఉండాలి?

ఇంకెంత కాలం ఈ దేశ సైనికులు ఏడుస్తూనే ఉండాలి?

Author:

ఎప్పుడూ సైనికుల కుటుంబాలే ఎందుకు ఏడవాలి..? మరి వీఐపీల విమానాల్లో ఎందుకు ఇలా జరగదు..? ఒకటీ రెండు సార్లు కాదు ఈ పదేళ్ళలోనే మాకుటుంబాల్లో ఏడుపులు… సైనికులకు ఎందుకు పాత విమానాలు ఇస్తున్నారు? నిన్న కూలిపోయిన విమానం చాలా పాతది. అలా ఇవ్వడం సరికాదు. మీరు సమాధానం చెప్పాలి. నాకు సమాధానం కావాలి’ అంటూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఓ యువతి నిలదీసింది…

ఢిల్లీలోని విమానాశ్రయానికి సమీపంలో బీఎస్ఎఫ్ కు చెందిన సూపర్ కింగ్ చిన్న విమానం కూలిపోయి ముగ్గురు బీఎస్ఎఫ్ అధికారులతో సహా పదిమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఏడుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు, ముగ్గురు సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఓ హెలికాప్టర్ మరమ్మతుల నేపథ్యంలో సాంకేతిక నిపుణులను రాంచీ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.బుధవారం వారి అంత్యక్రియలు సందర్భంగా సఫ్దార్ జంగ్ విమానాశ్రయానికి వచ్చి చనిపోయిన జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చనిపోయినవారిలో కో పైలెట్ శివరెయిన్ కుటుంబానికి చెందిన ఓ యువతి నేరుగా రాజ్ నాథ్ కి ప్రశ్నలు సంధించింది. చనిపోయిన కో పైలెట్ భార్య కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ.. బీఎస్ఎఫ్ విభాగానికి కొత్త విమానాలు కావాల్సిన అవసరం ఉందని తన భర్త చెప్పేవారని, ఈ విమానం ఎంతోకాలం నుంచి వాడుతున్నామని చెప్పారని అన్నారు. అందుకే గత ఏడాది ఆ విమానం వాడేందుకు ఆయన పలుమార్లు నిరాకరించారని చెప్పారు. పాత విమానాల వల్లే ఈ ఘటన జరిగిందని వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిరిజు స్పందిస్తూ..1995లో కొనుగోలు చేసిన ఈ విమానంలో ఎలాంటి లోపం లేదని..ఇప్పటి వరకు ఈ విమానం బాగానే పనిచేసిందన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించేందుకు నలుగురు సభ్యుల కమిటీ వేశామని..త్వరలో నిజాలు తెలుస్తాయని కిరణ్ రిరిజు అన్నారు.

(Visited 307 times, 1 visits today)