Home / Latest Alajadi / జియోకి షాక్: బీఎస్‌ఎన్‌ఎల్ నుండి 2 రూపాయలకే అన్ని కాల్స్ ఫ్రీ.

జియోకి షాక్: బీఎస్‌ఎన్‌ఎల్ నుండి 2 రూపాయలకే అన్ని కాల్స్ ఫ్రీ.

Author:

3 నెలల పాటు ఇంటర్ నెట్, వాయిస్ కాల్స్ అన్ని ఫ్రీ అనే ఆఫర్ ని రిలయన్స్ జియో ప్రకటించినప్పటి నుండి టెలికం రంగంలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి, మూడు నెలల పాటు మొబైల్ సేవలు అన్ని ఉచితంగా వస్తుండటంతో జనాలు అందరు ఎగబడి మరి రిలయన్స్ స్టోర్ ల ముందు లైన్లు కట్టి మరి జియో సిమ్ కోసం ఎగబడ్డారు, ఎయిర్ టెల్, ఐడియా, వోడా ఫోన్ సిమ్ లు ఉన్నవారు చాలామంది జియో సిమ్ మారిపోయారు.

జియో అన్ని ఫ్రీగా ఇవ్వడం వెనుక ఏదో కుట్ర దాగుంది అనే ఆరోపణలు వచ్చిన కూడా ఎవరు లెక్క చేయలేదు, కేవలం పది రోజులలోనే జియో కి 20 కోట్ల కస్టమర్లు వచ్చారు, జియో పోటీని తట్టుకునేందుకు వివిధ టెలికం కంపెనీలు కొన్ని ఆఫర్లు ప్రకటించినప్పటికీ అవి ప్రజలని ఆకట్టుకోలేకపోయాయి, కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం జియోకి బాగా పోటీని ఇస్తుంది, ఇప్పటికే 249 రూపాయలకే అపరిమిత ఇంటర్నెట్ అనే ఆఫర్ ని ప్రకటించింది, అయితే ఇది కేవలం బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మాత్రమే. కానీ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకోసం, రిలయన్స్ జియోకు షాక్ ఇచ్చేలా ఓ సరికొత్త ప్లాన్‌కు రూపకల్పన చేస్తోందని టెలికామ్ రంగంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. రిలయన్స్ జియో ఏ వ్యూహంతో అయితే కస్టమర్లను తన వైపుకు తిప్పుకుందో… అదే వ్యూహంతో బీఎస్‌ఎన్‌ఎల్ దెబ్బకొట్టాలని చూస్తోంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా ఫ్రీ వాయిస్ కాల్స్‌కు… ఫ్రీ వాయిస్ కాల్స్‌తోనే సమాధానం చెప్పేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ పక్కా ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది.

bsnl offers free calls plan

ఈ ప్లాన్ ప్రకారం బీఎస్ఎన్‌ఎల్ 2జీ, 3జీ వినియోగదారులకు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితంగా అందించాలని సంస్థ భావిస్తోంది. వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తేవాలని సంస్థ యోచిస్తోంది. దీని ప్రకారం 2-4 రూపాయల నెలవారి టారిఫ్‌తో వాయిస్ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. రిలయన్స్ జియో ప్రకటించిన నెలవారి ప్లాన్ విలువ 149 రూపాయలు. దీనికంటే బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ ఎన్నోరెట్లు తక్కువ. రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్లన్నీ 4జీ వినియోగదారులకు మాత్రమేనని, కానీ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టబోయే ఫ్రీ కాలింగ్ సదుపాయం 2జీ, 3జీ కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు బుధవారం తెలిపారు.

(Visited 33,890 times, 1 visits today)