Home / Inspiring Stories / శిజూ – మ్యాన్యువల్ జీపీఎస్ కండక్టర్

శిజూ – మ్యాన్యువల్ జీపీఎస్ కండక్టర్

Author:

Bus Conductor

శిజు ఈ 39 ఏళ్ళ మనిషిని మీరు కండక్టర్ అని కూడా పిలవొచ్చు.అయితే కేరళ లోని తాచొట్టూకావు సిటీలో నెయ్యటింకరా టూ టెక్నోపార్క్ రూట్ లో తిరిగే వాల్వో ఏసీ సిటీ బస్ లో ప్రయణీకులు మాత్రం ఫ్రెండ్లీ కండక్టర్/జీపీఎస్ కండక్టర్ అని పిలుచుకుంటారు. ఎందుకో తెలుసా రోజూ ఆరూట్ లో రెగ్యులర్ గా ప్రయాణించే ప్యాసింజర్లకు బస్సు వచ్చే సమయానికి ముందే వాట్సాప్ లో మెసేజ్ పెట్టి అలెర్ట్ చేస్తాడు. ఒక వేళ ట్రాఫిక్ లో కాస్త లేట్ అయ్యేటట్టున్నా,లేదంటే ఆయా స్టాప్ లకి చేరటానికి ముందే అప్ డేట్ ఇస్తూంటాడు.

ఎలా అంటే షిజూ తెక్నాలజీని విరివిగా వాడేసాడన్న మాట. తన బస్ లో రోజూ వచ్చే ప్రయాణీకులతో వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాడు. ఇక దాంట్లో బస్ బయల్దేరిన దగ్గరి నుంచీ ఒక్కో స్టాప్ దాటగానే గ్రూప్ లో ఆ విషయం అప్ డేట్చేస్తాడు.ఆ మెసేజ్ చూసుకునే వాళ్ళకి బస్ తమ స్టాప్ కి వచ్చేసరికి ఎంత టైం పడుతుందన్నది అర్థమౌతుందన్నమైపోతుంది. అంటే…! శిజూ తనకు తానే ఒక మ్యాన్యువల్ జీపీఎస్ లా పని చేస్తాడు. రోజూ ఒకే రూట్ లో ప్రయాణించే ఒక కండక్టర్ తో చాలా మందికి మంచి పరిచయం ఏర్పడుతుంది. కొన్ని సార్లు తమ రూట్ బస్ కండక్టర్లనూ ఇంట్లో శుభకార్యాలకు ఆహ్వానించటం చూసాం. షిజు తన రోజువారీ ప్రయాణీకుల కోసం. చేసే పని అతనికెంతో ఆనందాన్నిస్తుందట. “నా డ్యూటీ లో వాళ్ళూ ఒక భాగం అయితే నేను వాళ్ళ జీవితాల్లోనే వారికి తెలియకుండానే ఒక భాగం అయిపోయాను. మరి వాళ్ళ కోసం ఎంతో కొంత చేయాలి కదా” అంటాడు శిజు.

(Visited 263 times, 1 visits today)