Home / Entertainment / మళ్ళీ మనసున్న మహారాజూ అనిపించుకున్న పవర్ స్టార్.

మళ్ళీ మనసున్న మహారాజూ అనిపించుకున్న పవర్ స్టార్.

Author:

Pawan-Kalyan-Registered-Case-on-BVSN-Prasad

చత్రపతి, అత్తారింటికి దారేది, ‘నాన్నకు ప్రేమతో’ నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ పై నాన్నకు ప్రేమతో సినిమా రిలిజ్ టైం లో ‘మా’ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘అత్తారింటికి దారేది’ టైమ్‌లో తలెత్తిన గొడవ, ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదల టైమ్‌లో తెరపైకి రావడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది.తెలుగు సినిమా పరిశ్రమలో అందరికీ అత్యంత సన్నిహితుడుగా పేర్కొనే నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌, ఇకా తెలుగు నిర్మాతలకే కాదు,తెలుగు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన ముందుండే హీరోగా పేరున్న పవన్ కళ్యాణ్ మధ్య వివాదం రావడం చర్చనీయాంశమయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రసాద్ ఒక పది రోజుల గడువు అడిగి డబ్బులు సర్దుబాటు చేసినట్లు తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కి నిర్మాత ప్రసాద్ రెండు కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా అంత మొత్తం కాకుండా కాస్త డిస్కౌంట్ ఇవ్వాల్సిందిగా పవన్ ని కోరాడు నిర్మాత ప్రసాద్. దాంతో పవన్ కళ్యాణ్ తనకి రానున్న రెండు కోట్ల నుండి 25 శాతం డిస్కౌంట్ చేసి 1 కోటి 50 లక్షలు తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ 50 లక్షలు డిస్కౌంట్ ఇవ్వడంతో ప్రసాద్ కూడా సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇక ‘నాన్నకు ప్రేమతో’ విడుదల సమయంలో పవన్ నిర్మాతల మండలిలో ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కేవలం ప్రసాద్ కి ఫోన్ చేసి ఈ విషయాన్నీ గుర్తు మాత్రమే చేసినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. మరో పక్క త్రివిక్రమ్ కూడా తనకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ నుండి నిర్మాత ప్రసాద్ కి ఎంతవరకు డిస్కౌంట్ ఇస్తాడా లేకా తనకు ఎంత రావలో అంత తీసుకుంటాడా అనేది ఇప్పుడు మిగిలిన ప్రశ్న?

(Visited 1,909 times, 1 visits today)