Home / Inspiring Stories / ప్రజల నుండి లక్షలకు లక్షలు దోచుకుంటున్న నారాయణ పాఠశాలపై కేసు పెట్టిన యువకుడు.

ప్రజల నుండి లక్షలకు లక్షలు దోచుకుంటున్న నారాయణ పాఠశాలపై కేసు పెట్టిన యువకుడు.

Author:

ప్రభుత్వ విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేసి కార్పోరేట్ విద్య పేరుతో ప్రజలను దోచుకుతింటున్న ప్రైవేట్ విద్యా సంస్థల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారి ఆగడాలు శృతి మించుతున్నా కూడా విధ్యార్దుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కావడం వలన ప్రజలు సైలెంట్ గా ఉంటున్నారు, కాని హైదరాబాద్ కి చెందిన యువ సామాజికవేత్త విజయ్ గోపాల్ మాత్రం సైలెంట్ గా ఉండకుండా ప్రభుత్వ నిభందనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా ప్రజలను దోచుకుంటున్న ఒక పాఠశాలపై కేసు పెట్టి వారిపై విచారణ జరిగేలా చేసారు. ఇంతకి ఆ పాఠశాల సాదా సీదా వ్యక్తికి సంబంధించిన పాఠశాల కాదు, నేను ప్రజల సేవ కోసమే రాజకీయాలలోకి వచ్చానని చెప్పుకు తిరిగే ఒక మంత్రి గారిది.

narayana concept school

హైదరాబాద్ లో సదరు మంత్రి గారికి నారాయణగూడలో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది దానిపేరే నారాయణ కాన్సెప్ట్ స్కూల్. మరి ప్రజా సేవలో ఉన్న మంత్రి గారి పాఠశాల కదా అని తక్కువ ఫీజు తీసుకుంటారని వెళ్ళి కనుక్కుంటే ఆ ఫీజులు చూసి విజయ్ గోపాల్ దిమ్మ తిరిగింది. మాములుగా ప్రైవేట్ స్కూల్స్ లో వసూలు చేస్తున్న ఫీజులకన్నా మూడు, నాలుగింతలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీనిపై గతంలో తల్లి దండ్రులు ఒకటిరెండు సార్లు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా వారు పెద్దగా పట్టించుకోలేదట. దీంతో, ఇలాంటి పద్ధతులు మానుకోవాలని అసలు ఫీజు అనేది గవర్నమెంట్ నోర్మ్స్ అండర్ లో ఉండాలని మర్చిపోయిన స్కూల్ యాజమాన్యం పై గోపాల్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు FIR ఫైల్ చేసారు. ఎంతో మంది సామాన్య ప్రజలు ఆ FIR కి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ నిభందనల ప్రకారం 100.రూ ఉండాల్సిన అప్లికేషన్ ఫారంకు ఆ పాఠశాలలో 300.రూ అంతే కాక 5000.రూ ఉండాల్సిన అడ్మిషన్ ఫీజుకు బదులు 40,000.రూ వసూలు చేస్తూ పేరెంట్స్ ని నిలువునా దోచుకుంటున్నారు .

ఏ ప్రైవేట్ స్కూల్ అయినా వారు కల్పించే సౌకర్యాలను బట్టీ ఫలానా ఫీజు లోపే తీసుకోవాలని గవర్నమెంట్ చాలా క్లియర్ గా చెబుతున్నప్పటికీ చాలా ప్రైవేట్ స్కూల్స్ తమ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇలా అడ్డదిడ్డంగా వసూలు చేసే ఏ స్కూల్ పైన అయినా మనం పోరాడోచ్చు. విద్య అనేది మన ప్రాథమిక హక్కు అంటున్నారు గోపాల్. గతంలో కూడా ఒక మల్టీప్లెక్స్ థియేటర్ లో కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఎమ్మార్ఫీ ధరను మించి అమ్ముతున్నందుకు గానూ కేసు వేసి పోరాడుతున్నారు. దాదాపు ప్రతి పిల్లాడు, తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్న ఈ సమస్య ల పై పోరాటం చేస్తున్న గోపాల్ కి హాట్స్ ఆఫ్ చెబుతోంది అలజడి.

(Visited 1,399 times, 1 visits today)