Home / Political / కొత్త రూల్స్: డ్రంక్ అండ్ డ్రైవ్ కి 10 వేలు, లైసెన్స్ లేకపోతె జైలు శిక్ష.

కొత్త రూల్స్: డ్రంక్ అండ్ డ్రైవ్ కి 10 వేలు, లైసెన్స్ లేకపోతె జైలు శిక్ష.

Author:

ఇక ఇప్పుడు వాహనాలు కలిగిన వారు తగు జాగ్రత్తలు పాటించకుంటే సరాసరి జైలుకే అంటుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు రాష్ట్రాల అభ్యంతరాలతో పెండింగ్ లో ఉన్న మోటర్ వాహనాల బిల్ 2016 ను… కేంద్రం ఆమోదించింది. హెల్మెట్ లేకున్నా, లైసెన్స్ లేకున్న,ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న, ఇన్సూరెన్స్ లేకున్నా, ట్రాఫిక్ రూల్స్ పాటించకున్న ఇక నుండి భారీగా ఫైన్ వేస్తూ రూపొందించినదే ఈ బిల్లు.అలాగే ఈ బిల్లులో 68 సెక్షన్లకు సవరణలతో పాటు, 28 కొత్త సెక్షన్లు చేర్చింది. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రమాదాలను తగ్గించడమే అంటుంది కేంద్ర ప్రభుత్వం.

New-Motor-Vehicle-Act-Approved-By-Central-Government

ఈ బిల్ అమలులోకి వస్తే రూల్స్ అతిక్రమించి నడిపే వారు ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సిందే, మైనర్లకి వాహనం ఇస్తే ఓనర్లకి జైలు శిక్ష, హెల్మెట్, ఇన్సూరెన్స్ లేకుండా బండి నడిపితే లైసెన్స్ రద్దు వంటి కఠినమైన నిర్ణయాలతో ఈ బిల్ ని రూపొందించారు.

బిల్లులో పొందుపరిచినా విషయాలు:

  • సీట్ బెల్ట్ పెట్టుకోని వారికి 1000 జరిమాన.
  • ఓవర్ స్పీడ్ గా డ్రైవింగ్ చేస్తే 1000 – 4000 వరకు జరిమాన.
  • హెల్మెట్ లేకుండ డ్రైవింగ్ చేస్తే 2000 అలాగే, 3 నెలలు లైసెన్స్ రద్దు.
  • ఇన్సూరెన్స్ లేకుండా వాహనం డ్రైవ్ చేస్తే 2000 ల ఫైన్, 3 నెలల జైలు శిక్ష.
  • ట్రాఫిక్ నిబంధనల పాటించని వారికి 500 జరిమాన.
  • లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఫైన్ 5000 జరిమాన.
  • అధికారుల ఆదేశాలు పట్టించుకోకుంటే కనీస జరిమాన 2000.
  • మద్యం తాగి డ్రైవ్ చేస్తే 10,000 జరిమాన, జైలు శిక్ష.
  • ప్రమాదకర డ్రైవింగ్ కు జరిమాన 1000 నుండి 5 వేలకు పెంపు.
  • అర్హతలు లేకుండా డ్రైవ్ చేస్తే 10,000 జరిమాన.
  • ఎక్కువ లోడ్ తో వాహనాలు వెళ్తే 20 వేలు జరిమాన.
  • రూల్స్ పాటించని క్యాబ్ డ్రైవర్లకు లక్ష వరకూ ఫైన్.
  • హిట్ అండ్ రన్ కేసుల్లో దొరికిన వారికి 2 లక్షల రూపాయల ఫైన్.

రూల్స్ అతిక్రమించి వాహనాలని నడిపే వారికి భయం పుట్టేలా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్ ని తీసుకొచ్చింది, కేంద్ర క్యాబినేట్ ఆమోదించిన ఈ బిల్ ని వచ్చేవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు, దేశ ప్రజల భద్రతకి సంబంధించిన బిల్ కాబట్టి పార్లమెంట్ లో ఆమోదం పొందడం లాంఛనమే కాని ఇది అమలులోకి రావడానికి 6 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది, ఈ బిల్ ని అమలులోకి తెచ్చి రోడ్డు ప్రమాదాలని, రూల్స్ ని అతిక్రమించే వాహనదారులని కట్టడి చేయాలనీ దేశ ప్రజలు కోరుకుంటున్నారు.

(Visited 3,653 times, 1 visits today)