Home / Entertainment / సెన్సార్ బోర్డు సంస్కరణలకు నడుం బిగించిన కేంద్రప్రభుత్వం

సెన్సార్ బోర్డు సంస్కరణలకు నడుం బిగించిన కేంద్రప్రభుత్వం

Author:

Censor Board

దేశంలో సెన్సార్ బోర్డు సంస్కరణలకు కేంద్రప్రభుత్వం నడుం బిగించింది. కేంద్రం ప్రతిపాదించిన కమిటీ పర్యవేక్షణలో సెన్సార్ బోర్డు సంబంధించిన సంస్కరణ జరగనుంది. సినిమాటోగ్రఫీ చట్టాలలో మార్పులకు కూడా కమిటీ కొన్ని ప్రతిపాదనలను రూపొందించనుంది. సెన్సార్ బోర్డులో మార్పుల కోసం కొంతకాలంగా తీవ్ర విమర్శలకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

కేంద్రం ఏర్పాటు చేసిన ఈ కమిటీకి ప్రముఖ దర్శకుడు శ్యాం బెనగల్ అధ్యక్షత వహిస్తున్నారు. శ్యాం బెనగల్ మాట్లాడుతు.. ‘సెన్సార్ బోర్డులో లోపాలను సవరించేందుకు ప్రధానమంత్రి ఈ దిశగా దృష్టి పెడుతున్నట్టు నేను భావిస్తున్నానని’ చెప్పుకొచ్చారు . కేంద్రం నియమించిన సెన్సార్ ప్రక్షాళన కమిటీకి.. శ్యాం బెనగల్ అధ్యక్షత తొ పాటు..! ప్యానెల్ సభ్యులుగా రాకేశ్ ఓంప్రకాష్ మెహ్రా, పీయూష్ పాండే, భావనా సోమయ్య, నీనాలత గుప్తా ఉండనున్నారు. రెండు నెలల అధ్యయనం తర్వాత కేంద్రానికి ఈ కమిటీ నివేదికలు అందించనుంది. వివిధ ప్రపంచ దేశాల్లో అమలులో ఉన్న సినిమాటోగ్రఫీ చట్టాలను అధ్యయనం చేయనున్న కమిటీ.. తదనుగుణంగా మార్పులు-చేర్పులు చేసి కేంద్రానికి సిఫారసు చేయనుంది.

(Visited 107 times, 1 visits today)