Home / Inspiring Stories / చాణక్యుడికి నచ్చని ఆ ముగ్గురు ఎవరు ? ఈ ముగ్గురినీ దగ్గరకు రానీయకండి.

చాణక్యుడికి నచ్చని ఆ ముగ్గురు ఎవరు ? ఈ ముగ్గురినీ దగ్గరకు రానీయకండి.

Author:

మనుషులం కదండీ అందుకే మనసు ఎప్పుడు కుదురుగా ఉండదు. ఎన్నో సార్లు పడి లేస్తూ, గెలుస్తూ, ఓడిపోతూ, నవ్వుతూ, ఏడుస్తూ… మన చేతిలో ఉన్న కాలాన్ని గడుపుతూ ఉంటాం. సమయాన్ని సరైన పద్దతి లో వాడుకునే వాడే అసలైన గెలుపుని ఆస్వాదిస్తాడు. మరి సమయం వృధా చేసేవాడు ఎల్లప్పుడూ ఓటమి పాలు కావటం తథ్యం. అందుకే ప్రాచీన కాలం నుండి మనిషి అస్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి బాటన నడపడానికి మన ఈ నీతి గ్రంధాలు రచింపపడ్డాయి. అలాంటి గ్రంధాల్లో మన చాణక్య నీతిలోని ప్రతి ఒక వాక్యం ఎంతో ఉపయోగకరంగా, ఎంతోమందిని ఉత్సాహ పరిచే విధంగా ఉంటుంది. మరి చాణక్యుడు రచించిన చాణక్య నీతి లోని కొంత నీతిని మనం తెలుసుకుందాం.

chanakya neeti

చాణక్యుడు.. దేశానికి అర్ధ శాస్త్రాన్ని అందించిన మొదటి వ్యక్తి. ఈయన తండ్రి చనకుడు కూడా అధ్యాపకుడు కావడం వలన చాణక్యుడికి విద్య యొక్క విలువ బాగా తెలుసు. అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్ధశాస్త్ర విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్ధిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మరియు మనస్తత్వ శాస్త్రం లో కూడా ఎంతో నైపుణ్యం కనబరిచాడు. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం చాణక్య నీతి గా ప్రాచుర్యం పొందింది. క్రీస్తు పూర్వమే ఆయన బోధించిన నీతి వాక్యాలు ఈనాటికి సమాజానికి ఎంతో విజ్ఞానాన్ని కలిగిస్తాయి. నీతి ని బోధిస్తూ మంచి గురించి చెబుతూ.. ఈ ముగ్గురికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయకండి అని సంభోదిస్తాడు. మరి ఆ ముగ్గురు ఎవరంటే…

మొదటి వ్యక్తి: ఒకరు నీతిని మరిచిన మహిళ. ఇంటికి దీపం ఇల్లాలు అని ఊరికే అనలేదు మన పెద్దవాళ్ళు. ఇంటిలో మహిళ ఎన్ని సుగుణాలు కలిగి ఉంటే ఆ ఇంటికి అంత కాంతి. ఇంట్లోని మగవారు కొన్ని తప్పులు చేసిన సరిదిద్దుకునే ఓర్పు సహనం ఆడదానికి ఖచ్చితంగా ఉండాలి. అలాంటిది ఆడవారే సద్గుణాలు మరిచి నీతి లేని బాటను అలవర్చుకుంటే ఆ ఇంటికి అరిష్టం తప్పదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మహిళలకు సహాయం చేయడం సరికాదు. ఇలాంటి మహిళలు తొందరగా ఎదుటి వ్యక్తిని మోసం చేసి సహాయం కొరకు చేయి చాచుతారు. ఇలాంటి వారు సహాయం కోరి వచ్చినప్పుడు, నిజంగా వారికీ కష్టం ఉండి అడుగుతున్నారా? లేక మోసం చేస్తున్నారా? గమనించుకుని ఇందులో చెడ్డ వారికి దూరంగా ఉండడం ఉత్తమమైన పని.

రెండవ వ్యక్తి: కారణం లేకుండా ఎదుటివారిని నిందించే వారు. కొంతమంది ఎంత సంతోషకర విషయం అయినా సరే విచారంగా ఎదుటి వారి పై ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది. ఎప్పుడు ఒంటరి తనాన్ని కోరుకుంటారు. ఎదుటి వారి ఎదుగుదలను సహించరు. ఇలాంటి వారు ఎక్కడైనా సంతోషంగా ఉండలేరు. కారణం లేకుండా అందరి గురించి చేడు కోరే వారికి దూరంగా ఉండటం వల్ల మనకి ఎంతో మేలు.

మూడవ వ్యక్తి: ఈ వ్యక్తి వాడు చేసిందే ఒప్పు, మిగతా వారంతా తప్పు, అన్న భావనలో ఉంటాడు. ఇలాంటి వారికి సహాయం చేస్తే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మనం చేసిన సహాయం కూడా మర్చిపోయి మనతో తగాదాలకు దిగుతాడు.

మంచి వాడికి మంచి చేద్దాం చెడు వారికి దూరంగా ఉందాం.

(Visited 5,714 times, 1 visits today)