Home / Devotional / మీరు పుట్టిన నెల ఆధారంగా మీ ప్రవర్థననూ, మీలో ఉండే లోపాలను తెలుసుకోండి.

మీరు పుట్టిన నెల ఆధారంగా మీ ప్రవర్థననూ, మీలో ఉండే లోపాలను తెలుసుకోండి.

Author:

ఒక్కో రాశి వారి వ్యక్తిత్వం ఒకలా ఉంటుందంటుంది జ్యోతీశ్శాస్థ్రం , ఫలానా తేదీలో పుట్టేవారి వ్యక్తిత్వం వేరుగా ఉంటుందనీ చెప్తూంటారు. అలానే జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు.. ఇందులో ఒక్కొక్క నెలలో పుట్టిన వారి మనస్తత్వం ఒక్కోలా ఉంటుందంట.! ఒక అధ్యయనం ప్రకారం పుట్టిన నెలని బట్టి మీ మనస్థత్వం ఎలా ఉంటుందో తెలిసిపోతుందట. మరి మీరు పుట్టిన నెల ఏంటి? మీ మనస్తత్వం ఎట్టిదో ఇక్కడ చెక్ చేసుకోండి. అయితే ఇది జ్యోతీశ్యం కాదు కొన్ని వేలమంది పై జరిపిన అధ్యయనం ప్రకారం ఇచ్చిన ఒక నివేదిక. ఈ సర్వేలో పాల్గొన్న వారి నుంచీ ఒకే నెలలో పుట్టిన కొన్ని వేలమందిని పరీక్షించి మరీ చెప్పారన్న మాట.. నమ్మటం నమ్మకపోవటం అన్నది మీరు చెక్ చేసుకోవటాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది… మరి ఓ సారి ట్రై చేసి చూడండి.

Note: ఇది ఒక సర్వే నివేదిక నుండి తీసుకోబడినది, దీనిని నమ్మటం, నమ్మకపోవడం అనేది మీ వ్యక్తిత్వం పై ఆధారపడి ఉంటుంది.

జనవరి: ఈ నెలలో పుట్టినవారు అందంగా ఉంటారు. కలల్ని నిజం చేసుకుంటారు. ఎక్కడైనా తగ్గగలరు, నెగ్గగలరు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఎక్కువ.

ఫిబ్రవరి: ఏదైనా విషయానికి తొందరగా బాధపడిపోతారు. కోపం కూడా ఎక్కువే. ఎదుటివారిపై వెంటనే ఆ కోపాన్ని చూపిస్తారు.

మార్చి: భావోద్వేగాలు ఎక్కువగా చూపిస్తారు. ఆ ఫీలింగ్స్ ఎదుటివారి ఆలోచనలకు దారితీస్తుంది.

ఏప్రిల్: ఎదుటివారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. నమ్మకం ఎక్కువ. సున్నితమైన మనసు కలిగి ఉంటారు.

మే: తొందరగా ఆకర్షితులవుతారు. అందరిపై ప్రేమను ఒకేరకంగా చూపిస్తారు.

జూన్: కొత్తవాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. స్నేహితులతో కలిసి పరిహాసం చేయడం, ఆకర్షణీయమైన వ్యక్తులు కనిపించగానే ఇష్టపడతారు.

know-your-personality-by-your-birth-month

జూలై: అహంకారంగా ఉంటారు. ఖ్యాతిని కోరుకుంటారు. తొందరగా భావోద్వాగానికి లోనవ్వడం అనూహ్య మార్పులకు దారితీస్తుంది.

ఆగస్ట్: ఎప్పుడూ ఏదో ఒక అనుమానంతో ఉంటారు. సరదాగా ఉండటం, రహస్యాలను తెలుసుకోవడం, మంచి సంగీతం వినడం, పగటి కలలు కనడం, తొందరగా బాధపడుతారు.

సెప్టెంబర్: స్నేహితుల సమస్యను తెలుసుకొని తీర్చడం, వారిని ఓదార్చడం ఎక్కువ. చాలా తెలివైన వారు, భయం అంటే తెలియదు, ప్రేమ మరియు మన అనుకున్న వారిని చాలా కేరింగ్ గా చూసుకుంటారు.

అక్టోబర్: చాట్ చేయడానికి ఇష్టపడతారు. అబద్ధం చెబుతారు కానీ నటించరు. స్నేహితులను తొందరగా బాధపెట్టిన మళ్ళీ కలగోపుగా మాటలు కలుపుతారు. చాలా స్మార్ట్, ఆకర్షనీయులు, హాట్ అండ్ సెక్సీ గా ఉంటారట.

నవంబర్: నమ్మదగిన వారు, విశ్వాసం ఎక్కువ. ఏదైనా చేయాలనుకుంటే దాని గురించే ఆలోచిస్తారు. ప్రమాదకరమైన వారు కూడా. కలివిడిగా ఉంటారు. సీక్రెట్స్ చెప్పరు, స్వతంత్రంగా ఉంటారు.

డిసెంబర్: చూడటానికి చాలా బాగుంటారు. విశ్వాసం ఎక్కువ, ఉదారమైన మనసు కలవారు. దేశభక్తి ఎక్కువ. ప్రతి విషయంలోనూ పోటీ పడతారు. అర్థం చేసుకోవడం చాలాకష్టం. ప్రేమగా ఉంటారు, సులభంగా హర్ట్ అవుతారు. పై నెలలతో పోల్చితే అన్ని విషయాలలోనూ ఉన్నతంగా ఉంటారు.

అంతా అయ్యాక మీ మీ అభిప్రాయాలని కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసుకోండి.. మీ మీ మిత్రులకు కూడా చెప్పండి.

Must Read: మహా భారతం నుండి నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు…!

(Visited 1 times, 1 visits today)