Home / Inspiring Stories / మీరు ఎక్కడైన బిల్ ఇవ్వగానే చూసుకుంటున్నారా లేదా!

మీరు ఎక్కడైన బిల్ ఇవ్వగానే చూసుకుంటున్నారా లేదా!

Author:

aman aggarwal bill

మనం తరచూ స్టోర్స్ మరియు హోటల్స్ కి వెళ్తుంటాం. వారు ఇచ్చే బిల్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ రోజు  ఒక వక్తికి జరిగిన సంఘటన చూస్తే మీకు అర్ధం అవుతుంది తన వేదన మీకోసం తన మాటల్లోనే…..

              మీరు ఇక్కడ చూస్తున్న బిల్ లో మెనేజ్ మెంట్ లోపం వలన నేను 58 రూపాయలు అదనంగా కట్టవలసి వచ్చింది. మీరే చూడండి ముందుగా నాకు వస్తువుల పై ఉన్న బిల్ లెక్కేస్తే నేను చెల్లించ వలసింది 137రూపాయలు . ఆ తర్వాత షాప్ కంప్యూటర్లో  బిల్ కోడింగ్ వలన నేను బిల్ రూ 195.10చెల్లించ వలసి వచ్చింది. అంటే అదనంగా రూ 58  (before tax) తీసుకున్నారు. అలాగే నేను అదనంగా టాక్స్ కూడ కట్టవలసి వచ్చింది.
ఇక్కడితో అయిపోలేదు ఇంకా చూడండి… వారు  ఈ 195.10 రూపాయలకు టాక్స్ వేసి మొత్తం 233.58 రూపాయలుగా ఇచ్చారు, కానీ వారు నా దగ్గరి నుండి తీసుకున్నది మాత్రం 238.75. నాకు వచ్చిన బిల్ రూ233.58 కు అదనంగా ఇంకా రూ.5 కట్ట వలసి వచ్చింది. అంటే నా ఒకరి దగ్గరనే చెల్లించాల్సిన రుసుము కంటే 45శాతం   అదనంగా తీసుకుంటున్నారు. మరి రోజుకు మీ స్టోర్ లోకి  ఎంత మంది వస్తున్నారు? ఎన్ని డబ్బులు అదనంగా తీసుకుంటారు. ఇలాగే  వీరు ప్రజలను మొసం చేసి త్వరలోనే ఒక కొత్త బ్రాంచి ఓపెన్ చేస్తారు.

           నేను బిల్ చెక్ చేసుకున్న తర్వాత బ్రాంచ్ మెనేజర్ దగ్గరికి వెళ్ళి నాకు అదనంగా బిల్ వేశారు అని అడిగినపుడు, బిల్ తీసుకొని మీరు వేరు,వేరు ఐటమ్స్ తీసుకున్నారు అందుకనే మీకు వేరు,వేరు గా అదనంగా బిల్ వేశారు అన్నాడు. మా కంప్యూటర్లో ఇంతకు ముందే దాని రేటు మరియు  టాక్స్   ఫీడ్ అయ్యి ఉంటాయి కాబట్టి నేను ఏమి చెయ్యలేను అని అన్నాడు. కానీ గుడ్డిగా వారు కంప్యూటర్ ని నమ్మి వస్తువులపై  బిల్ వేసి ప్రజాలను ఇలా మోసం చేస్తున్నారు.
చూశార! మిత్రులారా మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో… మీరు కచ్చితంగా బిల్ వేసినప్పుడు వెంటనే ఏ వస్తువుకు ఎంత, దానీ టాక్స్ ఎంత అడిగి తెలుసుకోండి.
దీనిపై మెక్‌డోనాల్డ్ వారు నాకు కచ్చితంగా సమాధానంతో పాటు ఈ తప్పు ఏ విధంగా జరిగిందో వివరణ ఇవ్వండి. ఇలా జరిగిన వారికి వెంటనే తప్పులను సరి దిద్దుకొని వారికి వెంటనే డబ్బులు చెల్లించాలి.

aman aggarwal

(Visited 1,929 times, 1 visits today)