Home / Inspiring Stories / మట్టిలో పుట్టిన బంగారు పతకం

మట్టిలో పుట్టిన బంగారు పతకం

Author:

12571302_1688755781363883_1359517782_n

వాళ్ళది ఒక పేద కుటుంబం నిన్న మొన్నటి వరకు ఎవరు కూడా.. ఎలా ఉన్నారు? అని అడుగని వారు కూడా ఇప్పుడు వచ్చి శుభాకాంక్షలు చెప్పి వెలుతున్నారు. ఇంతకు అసలు విషయం ఏమిటి!?
హేప్జిబా 16 సంవత్సరాల ఒక నిరుపేద అమ్మాయి. తను రోడ్ సిగ్నల్స్ వద్ద పూలు అమ్మే అర్రాయి కూతురు. హేప్జిబా మట్టిలో పుట్టి మట్టిలో పెరుగొచ్చు కానీ తాను ఇప్పుడు బంగారు పతకం విజేత. మట్టిలో పుట్టిన మరో మాణిక్యం.
వారం క్రితం బ్రేజిల్ లో జరిగిన వరల్డ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ ఆటలలో భారత్ నుండి మూడు పతకలను సాదించుకొచ్చింది. అందులో ఒక్కటి బంగారు పతకం కూడా ఉన్నది. హేప్జిబా ఇప్పుడు ఎందరికో ఆదర్శం ఎందుకంటే తన మూడవ యేట తన తండ్రి చనిపోయాడు. అప్పటికే తనతో పాటు ఇంకో ముగ్గురు తోబుట్టువారు కూడా ఉన్నారు. వీరందరిని హేప్జిబా తల్లి ఒక దిక్కు పని చేసుకుంటు మరో పక్క వీరందరిని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది.

హేప్జిబా తన ఆరవ యేటానే తను అథ్లెటిక్ కావలని అనుకున్నది. దానితో ప్రతి రోజు సాధన చేస్తు లోకల్ గా జరిగే ఆటలలో పాల్గొనేది, తర్వాత మండల, జిల్లా  స్థాయిలో పాల్గొన్నది. కానీ ఎప్పుడైతే తొందియార్ పేట్ లో స్ట్రీట్ చిల్డ్రన్స్ యొక్క NGO వారు వచ్చి హేప్జిబాను కలిసారో అప్పుడే తన జీవితం మలుపు తిరిగింది. దానితో తనకు లైఫ్ లాంగ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ ఆటలో పాలుగొనే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. తనకు మొత్తం ఖర్చులు అన్ని NGO నే బరించింది.

ఎంత పేదవారు అయిన ఒక్క గెలుపుతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న హేప్జిబా ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుకుందాం.

(Visited 381 times, 1 visits today)