Home / Entertainment / ఎన్.టి.ఆర్ సినిమా లో చేతన ఉత్తేజ్

ఎన్.టి.ఆర్ సినిమా లో చేతన ఉత్తేజ్

Author:

Chetana Uttej

ఎన్.టి.ఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘జనత గ్యారేజ్'(వర్కింగ్ టైటిల్) అనే సినిమా లో రోజుకో కొత్త పేరు వినిపిస్తూంది. ఇప్పటికే ఈ సినిమాలో ముఖ్య పాత్రల కోసం మలయాళ స్టార్స్ అయిన మోహన్ లాల్ మరియు ఫహద్ ఫాజిల్ ని ఎంపిక చేసారు. ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సమంతని సెలక్ట్ చేస్తే, రెండవ హీరోయిన్ గా నిత్యా మీనన్ ని పరిశీలిస్తున్నారు.

అయితే ఇప్పుడు తెలుగు చలన చిత్ర సీమలో చాలా కాలంగా ఉంటూ నటుడిగా, రైటర్ గా ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉత్తేజ్. ఆయన తర్వాత ఆయన కుమార్తె చేతన ఉత్తేజ్ ‘షీ’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ సినిమా సెట్ పై ఉండగానే చేతనకి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. అదే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘జనత గ్యారేజ్'(వర్కింగ్ టైటిల్)లో నటించే అవకాశం రావడం.. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఎన్.టి.ఆర్ తన 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ని జనవరి 13న రిలీజ్ చేయడానికి గ్రాండ్ గా సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘జనత గ్యారేజ్’ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం చేతన ఉత్తేజ్ ని తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

(Visited 181 times, 1 visits today)