Home / Inspiring Stories / యూనివర్సిటీ ఆఫ్ చికాగో నా చికాగో స్టేట్ యూనివర్సిటీ నా..!?

యూనివర్సిటీ ఆఫ్ చికాగో నా చికాగో స్టేట్ యూనివర్సిటీ నా..!?

Author:

Chicago-State-University-to-honor-Doctorate-Degree-to-Nara-Chandrababu-Naidu

“బాబుగారి డాక్టరెట్ అసలు కథ” పేరుతో ఒక పత్రికలొ వచ్చిన కథనం ఇప్పుడు అనేక అనుమానాలని సామాన్యుడిలో కలిగిస్తోంది. బాబు కు డాక్టరేట్ ఇచ్చేది యూనివర్సిటీ ఆఫ్ చికాగో కాదనీ, అది అతి చెత్త ర్యాంక్ ఉన్న యూనివర్సిటీల్లో ఒకటైన చికాగో స్టేట్ యూనివర్సిటీ. యూనివర్సిటీ ఆఫ్ చికాగో అనేది అమెరికాలో ఉన్న టాప్ టెన్ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. ఐతే చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తున్న “చికాగో స్టేట్ యూనివర్సిటీ” మొత్తం అమెరికాలోనే అత్యంత తక్కువ ర్యాంక్ ఉన్న యూనివర్సిటీల్లో ఒకటి. మరో విషయాన్ని కూడా ఈ పత్రిక చెప్పింది. షికాగో స్టేట్ యూనివర్సిటీలో తెలుగువాడైన దేవీశ్రీ వి పొట్లూరి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని, కొన్ని నెలల క్రితమే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కూడా ఇదే యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడి “ప్రొఫెసర్ రవి అచంట” మంత్రితో పాటు దగ్గరుండి సమన్వయం చేశారట.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమెరికా లోని చికాగో విశ్వవిద్యాలయం అనే యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అసలు విశ్వవిద్యాలయం చరిత్రలోనే ఒక విదేశీ రాజకీయ నాయకుడికి ఈ డాక్టరేట్‌ ప్రకటించడం ఇదే ప్రథమం. ఈ పురస్కారాన్ని అంగీకరించాలని కోరుతూ రాసిన లేఖను విశ్వవిద్యాలయం ప్రతినిధులు గురువారం హైదరాబాద్‌లో చంద్రబాబుకు అందజేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర అభివృద్ధికొసం ఆయన చేస్తున్న కృషి, దార్శనికత, అసాధారణ ప్రతిభా సామర్థ్యాలు, సంస్కరణ దృక్పథం కలిగి ఉన్నందుకు ఈ డాక్టరేట్‌ ఇస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రతినిధులు అందజేసిన లేఖలో పేర్కొన్నారు. ఐతే ఇప్పుడు ఏ యూనివర్సిటీ బాబు గారికి డాక్టరేట్ ఇచ్చిందీ,అసలు అది నిజంగా ఇచ్చిందేనా లేక  ఇప్పించుకున్నదా అంటూ వస్తూన్న వార్తలకు టీడీపీ నేతలే సమాధానం చెప్పి. నిజానిజాలను తెలియ పరచాల్సిన అవసరం ఉంది లేదంటే. డాక్టరేటు రావతమేమోగానీ పురస్కారం అభాసు పాలయ్యే అవకాశం ఉంది…

(Visited 110 times, 1 visits today)